Komatireddy Venkat Reddy: నల్లగొండ గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించేందుకు ఆ పార్టీ అధిష్టానం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒకేసారి 45 మంది అభ్యర్థులను ప్రకటించి, ప్రత్యర్థి పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ సాహసోపేతమైన నిర్ణయంపై ఏఐసీసీ సైతం హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేకంగా అగ్రనాయకత్వం అభినందనలు తెలిపింది. నల్లగొండ కోటలో కాంగ్రెస్ బలానికి నిదర్శనంగా నిలవడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు కాంప్లిమెంట్స్ ఇచ్చారు.ఇక అభ్యర్థుల ఎంపికలో ఎక్కడా అసమ్మతికి తావులేకుండా, సామాజిక సమీకరణాలను సమతూకం చేస్తూ ఆయన చేసిన కసరత్తును అధిష్టానం కొనియాడింది. నల్లగొండను అభివృద్ధి పథంలో నడిపించడంలో మంత్రి చూపిస్తున్న చొరవ అభ్యర్థుల గెలుపుకు సోపానంగా మారుతుందని పార్టీ భావిస్తోంది.
Also Read: Thummala Nageswara Rao: రైతు, వ్యవసాయ, ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వాలి : మంత్రి తుమ్మల
సర్వేల్లో ‘హస్తం’ హవా.. 40 వార్డుల్లో పాజిటివ్ టాక్
ఎన్నికల క్షేత్రస్థాయి పరిస్థితులపై పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలు కాంగ్రెస్‌కు భారీ ఊరటనిస్తున్నాయి.మొత్తం 48 వార్డులకు గాను, దాదాపు 40 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు స్పష్టమైన అనుకూలత ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి పనులు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి.అయితే ఈ అభ్యర్థుల ప్రకటన అకస్మాత్తుగా జరిగింది కాదు. గత రెండు నెలల నుంచే ప్రతి వార్డులో ఆశావాహుల బలాబలాలు, వారికున్న క్లీన్ ఇమేజ్, ప్రజలతో ఉన్న సంబంధాలపై లోతైన అధ్యయనం జరిగిందని మంత్రి సన్నిహితులు చెప్తున్నారు. ఇక అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించడం వల్లే ఇంత త్వరగా తుది జాబితాను విడుదల చేయడం సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.నల్లగొండ మున్సిపాలిటీపై పట్టు సాధించడం ద్వారా జిల్లా అంతటా కాంగ్రెస్ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపాలని హైకమాండ్ భావిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో చూపిన ఇదే వేగాన్ని ప్రచారంలోనూ కొనసాగిస్తే, నల్లగొండ మున్సిపల్ పీఠం దక్కించుకోవడం కాంగ్రెస్‌కు నల్లేరు మీద నడకే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ప్రజా సేవ చేయడమే లక్ష్యం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 2200 కోట్ల రూపాయలతో నల్లగొండ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు వేగంగా ప్రగతిలో ఉన్నాయి. రాబోయే రోజులలో ఇంకా నల్లగొండకు మరిన్ని నిధులు తీసుకువచ్చి, రాష్ట్ర ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వ సహకారంతో నల్లగొండను తెలంగాణలోనే నెంబర్ వన్ పట్టణంగా, ఒక “సూపర్ స్మార్ట్ సిటీ”గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను .ఈ మహత్తర లక్ష్యాన్ని సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 48 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు ఒక చారితాత్మకమైన తీర్పు ఇచ్చి, 100 శాతం ఫలితంతో మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. గత 30 సంవత్సరాలుగా ప్రజలు ప్రేమతో, విశ్వాసంతో ఎలా ఆదరిస్తూ వచ్చారో, అదే విధంగా ఈసారి కూడా హస్తం (చెయ్యి) గురుపై ఓటు వేసి, ఆశీర్వదించాలి” అని మంత్రి ప్రజలను కోరారు.
Also Read: Komatireddy Venkat Reddy: కేసీఆర్ ముందు నీ బిడ్డ లెక్కకు సమాధానం చెప్పు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

