Sumathi Sathakam Trailer: విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి (Sai Sudhakar Kommalapati) నిర్మాతగా ఎంఎం నాయుడు రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సుమతీ శతకం’ (Sumathi Sathakam). బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary), శైలి చౌదరి (Saylim Chaudhari) జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా మేకర్స్ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్ అనే ఫీల్‌ని కలగజేస్తోంది. ఈ ట్రైలర్ (Sumathi Sathakam Trailer)ను గమనిస్తే..
Also Read- Movie Press Meet: ఒకే టైమ్‌కి రెండు వేరు వేరు సినిమాల ప్రెస్ మీట్స్.. దర్శకనిర్మాతలు అసంతృప్తి!
పిఠాపురం ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు?
ట్రైలర్ స్టార్టింగే.. టీచర్, స్టూడెంట్ జోక్‌తో ప్రారంభించి ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌కు లోటుండదనే హింట్‌ని ఇచ్చారు. అమర్ దీప్, టేస్టీ తేజ మధ్య వచ్చే ప్రతి డైలాగ్ చక్కగా పేలింది. ముఖ్యంగా అప్పట్లో పిఠాపురం ఎమ్మెల్యే గారు చెప్పింది నిజమే? అని టేస్టీ తేజ అనగానే.. ఏం చెప్పారు? అని అమర్ దీప్ అడగడం.. వెంటనే ప్రేమంటే సులువు కాదురా అని తేజ పాడటం.. చూస్తే, ఈ సినిమాలో ప్రేమ కోసం, పెళ్లి కోసం అమర్ దీప్ ఎన్ని కష్టాలు పడతాడో అనేది తెలుస్తోంది. ట్రైలర్ కూడా అదే థీమ్‌తో నడిచింది. అమర్ దీప్ పెళ్లి కోసమే అన్నట్లుగా ఈ మూవీ కాన్సెప్ట్ ఉంది. పెళ్లి కోసం అమర్ దీప్ ఏం చేశాడు? తను ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? మధ్యలో రెండు ఊర్లు, గుడిలో అమ్మవారు మిస్సవడం వంటి టర్నింగ్ పాయింట్స్‌ని కూడా ఈ ట్రైలర్‌లో చూపించడం విశేషం.
Also Read- Annagaru Vostaru: ఓటీటీలోకి అన్నగారు వచ్చేశారు.. స్పందన ఎలా ఉందంటే?
జంట చూడముచ్చటగా ఉంది
ఈ సినిమాలో ఏం ఉంటుందనేది, ఈ ట్రైలర్‌లో చాలా క్లారిటీగా చెప్పారు. జూనియర్ రవితేజ అని అనిపించుకునే అమర్ దీప్.. ప్రతి ఫ్రేమ్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు. హీరోయిన్ చూడటానికి చాలా అందంగా ఉంది. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. టెక్నికల్‌గా కూడా హై స్టాండర్ట్స్‌లో ఈ సినిమా తెరకెక్కినట్లుగా ట్రైలర్ తెలియజేస్తుంది. సినిమాలో అన్ని అంశాలు ఉన్నట్లుగా ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది. ఫిబ్రవరి 6న అమర్ దీప్ భవితవ్యం ఏంటనేది తేలనుంది. మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను డబుల్ చేయడంలో ట్రైలర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. సుభాష్ ఆనంద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

