Movie Press Meet: టాలీవుడ్‌లోనే కాదు, ఇతర ఇండస్ట్రీలలో కూడా మీడియా సమావేశాల సమయంలో క్లాష్‌లు వస్తుంటాయి. వాటిని జయించడానికి పీఆర్ టీమ్‌లు ఎప్పటికప్పుడు అప్డేటెడ్‌గా ఉంటుంటారు. అయినా కూడా మీడియా సమావేశాల విషయంలో క్లాష్‌లు వస్తూనే ఉంటాయి. తాజాగా కన్నడ చిత్రం ‘కొరగజ్జ’ (Koragajja) ప్రచార కార్యక్రమం విషయంలో ఊహించని విధంగా జరిగింది. ఇలాంటి క్లాష్‌లు ఉండకూడదనే, ‘కొరగజ్జ’ మూవీ టీమ్ వారం ముందే ఈ జనవరి 24న మీడియా సమావేశం అంటూ ప్రెస్‌కు ఆహ్వానం పంపిందట. ఆ షెడ్యూల్ ప్రకారం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటులను ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, మీడియా సమావేశానికి కొంత సమయం ముందు మరో మలయాళ చిత్రం ప్రెస్ కాన్ఫరెన్స్‌ను అనౌన్స్ చేయడంతో.. చేసేది లేక ‘కొరగజ్జ’ టీమ్ తమ సినిమా ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నారట. దీంతో నిర్మాత, దర్శకుడు తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వస్తే..
Also Read- Annagaru Vostaru: ఓటీటీలోకి అన్నగారు వచ్చేశారు.. స్పందన ఎలా ఉందంటే?
దర్శకనిర్మాతల నిరాశ
జనవరి 24న కొచ్చి హాలిడే ఇన్‌లోని గ్రాండ్ బాల్‌రూమ్‌లో ‘కొరగజ్జ’ మీడియా సమావేశం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు కబీర్ బేడీ, సీనియర్ నటి భవ్య ప్రత్యేకంగా కొచ్చికి వచ్చారు. ఈ ఈవెంట్‌కు ముందురోజు రాత్రి మమ్ముట్టి (Mammootty) నటించిన మలయాళ చిత్రం ప్రెస్‌మీట్ అదే సమయానికి షెడ్యూల్ అయినట్లు తమకు సమాచారం అందిందని ‘కొరగజ్జ’ బృందం తెలిపింది. కొచ్చిలో ఫిల్మ్ జర్నలిస్టుల సంఖ్య పరిమితంగా ఉండటంతో మీడియా హాజరు విషయంలో చివరి నిమిషంలో సందేహాలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రెస్‌మీట్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్రయూనిట్ పేర్కొన్నారు. దర్శకుడు సుధీర్ అత్తావర్ (Sudheer Attavar), నిర్మాత త్రివిక్రమ్ సపాల్య (Thrivikrama Sapalya) ఈ ఘటనపై తమ నిరాశని వ్యక్తం చేస్తూ, వారి ఆవేదనని తెలియజేశారు.
Also Read- Dhurandhar OTT: రేపే ఓటీటీలోకి రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హామీలను గౌరవించడం ముఖ్యం
ఇలాంటి సమావేశాలకు సంబంధించి షెడ్యూల్ సమస్యలు సహజమే అయినప్పటికీ, పీఆర్ బృందాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘కొరగజ్జ’ చిత్రానికి పలువురు మలయాళ టెక్నీషియన్లు, గాయకులు పనిచేశారని నిర్మాతలు గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో ఈ సినిమాకు మీడియా నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. చిత్ర ప్రచారంలో భాగంగా కొచ్చికి వచ్చిన కబీర్ బేడీ.. మలయాళ సినీ పరిశ్రమపై తనకు ఎంతో గౌరవం ఉందని, ఇలాంటి పరిస్థితి బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి షెడ్యూల్ ఓవర్‌ల్యాప్‌లు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య మెరుగైన కమ్యూనికేషన్ ఉంటే పరస్పర గౌరవం నిలబడుతుందని వ్యాఖ్యానించారు. అలాగే, సీనియర్ నటి భవ్య కూడా ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కళాకారులు, మీడియాకు ఇచ్చిన హామీలను గౌరవించడం ఎంతో ముఖ్యమని అన్నారు. నిర్మాత త్రివిక్రమ్ సపాల్య మాట్లాడుతూ.. మంగళూరు సహా పలు నగరాల్లో ‘కొరగజ్జ’ ప్రచార కార్యక్రమాలు సక్సెస్‌ఫుల్‌గా జరిగాయని, కొచ్చిలో ప్రెస్‌మీట్ వాయిదా పడటం సినిమా ప్రచార వేగంపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

