Collector Rahul Sharma: భూపాలపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ (Collector Rahul Sharma) పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రతా చర్యలు, నామినేషన్ల స్వీకరణ విధానాన్ని ఆయన నేరుగా పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా కొనసాగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
చట్టబద్ధమైన విధానాలను కచ్చితంగా అమలు చేయాలి
నామినేషన్లు దాఖలు చేయుట లో సలహాలు, సూచనలు కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు జనవరి 30వ తేది చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండే ఆవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికల సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో అదనపు సిబ్బందిని నియమించి, క్యూలైన్లు సక్రమంగా నిర్వహించాలని, చట్టబద్ధమైన విధానాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
శాంతి భద్రతలు పటిష్టంగా నిర్వహించాలి
నామినేషన్లు వివరాలు రిజిష్ట్రర్ లో నమోదు చేయాలని, సమయం నమోదు చేయాలని ఆదేశించారు. భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, పోలీస్ శాఖతో సమన్వయం పెంచి శాంతి భద్రతలు పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రిటర్కింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: Collector Rahul Sharma: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైంది.. కలెక్టర్ రాహుల్ శర్మ!

