Shruti Haasan: దుల్కర్ సినిమాలో మరో తార లుక్ అదిరింది
A woman wearing glasses is seen through a misty surface, holding a cigarette, with smoke partially obscuring her face.
ఎంటర్‌టైన్‌మెంట్

Shruti Haasan: దమ్ము కొడుతూ.. దుల్కర్ సినిమాలో మరో తార లుక్ అదిరింది

Shruti Haasan: వరుస సక్సెస్‌లతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న వెర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ‘మహానటి’, ‘సీతా రామం’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులతో సైతం మనోడే అనిపించుకుంటున్న ఈ పాన్-ఇండియా స్టార్, ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara) అంటూ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. విలక్షణ దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. ఈ మధ్య చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న శృతి హాసన్ (Shruti Haasan), ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. బుధవారం (జనవరి 28) ఆమె పుట్టినరోజు (HBD Shruti Haasan) సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.

Also Read- Shabara Telugu Teaser: రక్తం చూడని యుద్ధముంటుందా?.. ఆసక్తికరంగా ‘శబార’ టీజర్!

దమ్ము కొడుతూ..

ఈ పోస్టర్‌ను గమనిస్తే.. శృతి హాసన్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తోంది. కళ్ళకు అద్దాలు పెట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో ఉండటమే కాకుండా.. పెదవుల మీద ఉన్న సిగరెట్, దాని నుంచి ఎగసే పొగ ఆమె పాత్రకు ఒక గ్రిట్టీ అండ్ రఫ్ టచ్ ఇస్తోంది. ముఖ్యంగా ఆమె దమ్ము కొట్టే విధానం చాలా ప్రొఫెషనల్‌గా ఉండటం విశేషం. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక పవర్ ఫుల్ రోల్‌లో ఆమె ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఆమె అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ చాలా సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమాలు చేస్తోంది. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకం కాబట్టే.. దర్శకుడు కథ చెప్పగానే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

Also Read- Laxmi Raai: సౌత్ నుంచి నార్త్‌కి లక్ష్మీరాయ్ సినిమా.. బ్రేక్ వస్తుందా?

సమ్మర్‌కి విడుదల

ఇక ఈ సినిమాను ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సరసన కొత్త తార సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఆమె లుక్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేయగా.. చక్కని పల్లెటూరి అమ్మాయిగా మంచి స్పందనను రాబట్టుకుంది. ‘లక్కీ భాస్కర్’ తర్వాత మరోసారి దుల్కర్ కోసం జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సుజిత్ సారంగ్ విజువల్స్, శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాను సాంకేతికంగా హై స్టాండర్డ్స్‌లో నిలబెట్టనున్నాయి. ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం, 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. సాదాసీదా కథలకు భిన్నంగా, ఒక ఎమోషనల్ అడ్వెంచర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా, దుల్కర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?