Land Scam: ధరణి పోయినా.. భూ భారతి వచ్చినా సామాన్య ప్రజలకు ప్రయోజనం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ సమస్యలు పరిష్కారం చెందాలంటే అధికార పార్టీ నేతలకుగానీ, రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లకే అనుకూలంగా భూ భారతి ఉందని తెలుస్తోంది. సామాన్య రైతు ఎన్నో యేండ్లుగా కబ్జాలో ఉన్నప్పుడు భూ విస్తీర్ణ పెరిగిన ప్రయోజనం ఉండదు. అదే రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులుంటే పట్టా భూములకు అనుకొని ఉన్నా.. ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయా, వక్ఫ్, సీలింగ్ ల్యాండ్ ఉంటే చాలు ఆ భూమిని సైతం పట్టాలు చేసుకునే ధైర్యం ఉంటుంది. అదే సామాన్యులు ఎన్నో యేండ్లుగా కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటే పట్టాలు చేసేందుకు అధికారులకు చేతులు రావు. రాజకీయ అండదండలతో అధికార పార్టీ మద్దతుతో అక్రమాలు చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోలేరు. బాధిత సామాన్య రైతులకు రెవెన్యూ అధికారులు అండగా ఉండనే ప్రచారం సాగుతుంది.
జేబీ ఇన్ ఫ్రా జోక్యంతోనే పెరిగిన విస్తీర్ణం
జేబీ ఇన్ఫ్రా చేపడుతున్న లేఅవుట్లో భూ సమస్యలున్నాయి. కోర్టు కేసులతో వివాదమైతున్న భూములే లక్ష్యంగా రియల్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా రికార్డుల్లోనున్న భూ విస్తీర్ణంతో పనిలేకుండా పోజిషన్లోనున్న విస్తీర్ణం మొత్తం తమ ఖాతాలోకి వచ్చేటట్లు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూర్ గ్రామంలోని 371, 372, 374, 377 సర్వే నెంబర్లో సుమారుగా 55 ఎకరాల భూమిలో జేపీ ఇన్ఫ్రా నిర్మాణాలు చేపట్టేందుకు సిద్దమైయ్యింది. అందుకు అనుమతి తీసుకోకుండా అధికార బలంతో ఇష్టానుసారంగా వినియోగదారులను బురడి కొట్టించేందుకు చర్యలు తీసుకుంటుందనే ఆరోపణలున్నాయి.
కోర్టు పరిధిలోనున్న సీమాంధ్ర వాళ్ల భూమిని కావాలనే జేబీ ఇన్ఫ్రా యాజమాన్యం తీసుకుంది. ఈ భూమి పక్కనే రికార్డులోకి రాని భూమి ఉండటమే ఇందుకు కారణమని ప్రచారం సాగుతుంది. కోట్ల విలువైన భూములను కాజేసేందుకు ఇష్టానుసారంగా రియల్ మాఫీయా ప్లాట్లు చేసి వినియోగదారులకు అంటగట్టే ప్రయాత్నం చేస్తున్నారు. ధరణి ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంత భూమిపై జేబీ ఇన్ఫ్రా కన్నెసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కూడా అధికారంతో రికార్డులను తారుమారు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారుగా 20 ఎకరాలపై విస్తీర్ణం రికార్డుల్లో లేదు. ఈ భూమిని తమ ఖాతాలో జమ చేసుకున్నట్లు స్ధానికులు గుసగుసలాడుతున్నారు. ఈ భూమి కోసమే ఆరాటపడిన జేబీ ఇన్ఫ్రా ఫలితం లభించింది. ఎట్టకేలకు ఆభూమి విస్తీర్ణం పెరిగింది.
Also Read: Land Scam: కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు ఎసరు..?
జేబీ ఇన్ఫా గ్రూప్ మాయజాలం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 371, 372, 374, 377 సర్వే నెంబర్ల్లో లేవుట్ నిర్మాణం చేస్తున్నారు. భూ కోనుగోల విస్తీర్ణంకు, లేవుట్ విస్తీర్ణకు పోంతన లేదు. మిగులు భూమికి పక్కనున్న పట్టా భూమిని జేజీ ఇన్ఫా గ్రూప్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఆ భూమి పక్కనున్న సర్వే నెంబర్ కేటాయించిన భూమిపై జేపీ ఎన్ఫ్రీ కన్నేసింది. ఆ భూమిని కాజేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే పహాణీలో పోందుపర్చినట్లుగా విస్తీర్ణం తక్కువగా ఉంది. అదే విస్తీర్ణం భూ భారతిలో పెరిగిపోవడంతో పలు అనుమానాలకు తావునిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ప్లేక్సీలు వేసి వినియోగదారులను బురడి కొట్టించడం జేబీ ఇన్ఫ్రాకు ఆలవాటుగా మారిపోయింది.
భువన పేరుతో భూ డవలప్మెంట్
జేబీ ఇన్ఫ్రా పేరుతో రియల్ వ్యాపారం చేసేందుకు మొదట శ్రీశైలం హైవే పై పెద్ద పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భూమిపై ప్లాట్లు చేయకుండానే బ్రోచర్‌పై లేవుట్ చేసి క్రయ విక్రయాలకు శ్రీకారం చుట్టారు. ఈ స్థలంలో ఉన్న వివాదాలను స్వేచ్ఛ దినపత్రిక ద్వారా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. దీంతో జేబీ ఇన్ఫ్రా పేరుతో క్రయవిక్రయాలు చేస్తే మార్కెటింగ్ కష్టమైతుందనే ఆలోచనతో మరో పేరుతో ప్రచారానికి సిద్దం చేశారు. అయితే ఇటీవల కాలంలో అంగరంగ వైభంగా భువన ఇన్ఫ్రా పేరుతో మరోసారి ప్లాట్ల బ్రోచర్‌ను విడుదల చేసి ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా శ్రీశైలం హైవేలో గతంలో జేబీ ఇన్ఫ్రా పేరుతో ఉన్న హోర్టిండ్ స్థలంలో భువన ఇన్ఫ్రా పేరుతో వెలిశాయి. ఇదంతా ఆ నేత రియల్ ముసుగులో చేసే భాగోతం బహిర్గతం కాకుండా ఉండేందుకు మరో పేరుతో వ్యాపారం ప్రారంభించారు.
కోర్టు కేసులున్న పట్టించుకోవడం లేదు
.గద్దగూటి హరికృష్ణ, బాధితుడు మా తాత గద్దగూటి పెద్ద ఎల్లయ్య తుమ్మలూరు గ్రామంలోని సర్వే నంబర్ 371,372,377 లలో పీటీ దారులుగా ఉన్నారు.(రక్షిత కౌలుదారులుగా) ప్రస్తుత్వం పై సర్వే నంబర్ లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు రియల్ ఎస్టేట్ సంస్థ కలిసి వెంచర్ చేస్తున్నారు. 371,372,377 సర్వే నంబర్ లలో చేస్తున్న వెంచర్ లో ప్రజలు ఎవ్వరు కూడా ప్లాట్లు కొని మోసపోవద్దు అన్నారు. ఈ భూమి కోర్టు పరిధిలో ఉంది.

