Nature Resorts
Real Estate

India: నేచర్ రిసార్ట్స్ కు డిమాండ్

  • ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో పెరిగిన ఇళ్ల కొనుగోళ్లు
  • రెండో ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్లు పర్యాటక ప్రాంతాలపై మొగ్గు
  • చక్కని ఆహ్లాదం, ఆరోగ్యం రెండూ కోరుకుంటున్న టెక్కీలు
  • ఫ్యామిలీతో రిసార్టులలో ఎంజాయ్ చేయాలనుకుంటున్న ఉద్యోగులు
  •  చక్కని పర్యాటక ప్రాంతాలలో రిసార్ట్స్ అమ్ముతున్న వ్యాపారులు
  • అందుబాటు ధరలో దొరుకుతున్న రిసార్ట్స్
  • రిసార్ట్స్ కొనుగోలుపై విదేశీయుల మోజు
  • కొండలు, గుట్టలపై వెలుస్తున్న రిసార్ట్స్

Software tekkis, NRI, foreigners interested to purchase Resorts at tourist places:
ఎప్పుడూ కాంక్రీట్ జంగిల్ పట్టణాలలో రొటీన్ వర్క్ చేసుకుంటూ..లైఫ్ లో ఎలాంటి ఎంజాయ్ మెంటూ లేకుండా జీవనం సాగిస్తున్నారు ఉద్యోగులు. చాలినంత సంపాదన ఉన్నా మనసులో ఏదో వెలితి. ప్రస్తుతం జీవన విధానంలో చాలా మార్పులే వచ్చాయి. సెలవలు వస్తే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే ముందుగా అక్కడ వసతి సమస్య. ముందుగా రూమ్స్ బుక్ చేసుకుందామంటే అప్పటికే ఖాళీలు దొరకవు. అలాంటి వాళ్ల కోసమే రియల్టర్లు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. హాయిగా ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ…చుట్టూ కొండలు, జలపాతాలను చూస్తూ అక్కడే ఓ వారం రోజుల పాటు ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరు అన్నట్లుగా ఉంటుంది. జీవితమంటే సంపాదించడమే కాదు.. సంతోషంగా గడపాలనే ఆలోచనలకు వచ్చారు. ఈ క్రమంలోనే ఉన్న ఊరిని, ప్రాంతాన్ని కాదని దూరంగా పచ్చని ప్రకృతిలో సేద తీరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే తమ రెండో ఇంటిని సముద్ర తీరం, కొండల, గుట్టల, అటవీ ప్రాంతాల్లో ఉండేలా కొనుగోలు చేయడమే కాకుండా అక్కడే కొన్నాళ్లు జీవించేందుకు సైతం ఇష్టపడుతున్నారు. ట్రెక్కింగ్‌, సాహసాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు, ప్రకృతిలో సేద తీరేందుకు ఇలా వివిధ రకాలుగా నగరం నుంచి ఏటా వేలాది మంది దూర ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. వీరిలో ఇప్పుడు చాలా మంది అలాంటి ప్రాంతాలకు వెళ్లడమే కాకుండా అక్కడే నెలలపాటు ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన కొందరు రియల్టర్లు సైతం తమ వెంచర్లను ఇప్పుడు సుదూర ప్రాంతాలకు, ప్రకృతి ఒడికి దగ్గరకు తీసుకెళ్తున్నారు.

స్వచ్ఛమైన వాతావరణం

సమ్మర్ వస్తే చాలు గోవా వెళదామా లేక ఊటీ వెళదామా అని ప్లాన్ చేస్తుంటారు. పిల్లలు విదేశాలలో స్థిరపడ్డాక వారి తల్లిదండ్రులు కూడా ఇలాంటి ప్రదేశాలలో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకని పిల్లలు కూడా తమ పేరెంట్స్ కు ఇలాంటి రిసార్ట్స్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. సెలవల్లో తాము కూడా పిల్లలతో వచ్చి తమ తల్లిదండ్రులతో కలిసి ఎంజాయ్ చేయొచ్చని భావిస్తున్నారు.
. ఇప్పుడు వివిధ రంగాల్లో స్థిరపడిన చాలా మంది మంగళూరు, గోవా, కూర్గ్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు సైతం కొనుగోలు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి ఎరువులూ లేకుండా పండే ఆర్గానిక్ పంటలతో వంటలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రకంగా మానసిక ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆర్గానిక్ ఫుడ్ ను సైతం ఇక్కడ ఆస్వాదిస్తున్నారు. యూరోపియన్లు, రష్యన్లు, అమెరికన్లు ఇలా వివిధ దేశాలకు చెందిన వారు చాలా వరకు తమ దేశాల్లో మైనస్‌ డిగ్రీ వాతావరణం ఉన్నప్పుడు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో సేద తీరేందుకు వస్తుంటారు. వీరు నెలల తరబడి ఇక్కడ గడుపుతుంటారు. పచ్చని ప్రకృతి ఉండే ప్రాంతాలతోపాటు సముద్ర తీర నగరాలకు ఎక్కువగా వెళ్తుంటారు. ఇటీవల ఆలయ ప్రాంతాల చుట్టుపక్కలకు సైతం వచ్చి సేదతీరుతున్నారు. మరికొందరు ఏకంగా ఇక్కడ నివాసాలను కొనుగోలు చేసుకొని ఇక్కడే నివసిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే చాలామంది గోవా, కసోల్‌, పుదిచ్చెరి, గోకర్ణం, హంపి, రుషికేష్‌, యానాం తదితర ప్రాంతాల్లో నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వర్క్‌ ఫ్రం హోం చేసే టెకీలు చాలా మంది ఇప్పుడు సుదూర ప్రాంతాల్లో సొంతింటిని కొనుగోలు చేసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా తమ రెండో ఇంటిని పర్యాటకంగా పేరు గాంచిన ప్రాంతాలకు సమీపంలో ఉండేలా చూసుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా ఉంటున్నారు. తమ పని చేసుకోవడంతోపాటు వారాంతంలో చుట్టుపక్కల ఉండే బీచ్‌ ప్రాంతానికి, లేదా ఆలయాలకు వెళ్లి ఆనందంగా గడుపుతున్నారు.

రియల్టర్ల సరికొత్త ఆలోచన

పర్యాటక ప్రాంతాల్లో కొందరు రియల్టర్లు ఇప్పుడు నివాస, వ్యాపారపరంగా ఉండేలా నిర్మాణాలను తీర్చిదిద్దుతున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే ఉండేందుకు, తాము లేని సమయంలో అద్దెకు ఇచ్చేందుకు అనువుగా సైతం వీటిని చేపడుతున్నారు. రిసార్ట్‌లను నిర్మించడంతోపాటు ఆయా నిర్మాణాల్లో కొంత భాగాన్ని చదరపు అడుగుల లెక్కన విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు అక్కడ నివసించని సమయంలో వాటిని అద్దెకు ఇచ్చి అందులో తగిన వాటాను వారికి చెల్లిస్తారు. ఇదే కాకుండా విల్లాలను సైతం నాలుగు భాగాలుగా చేసి తక్కువ బడ్జెట్‌లో కొనుగోలు చేసే వారికి విక్రయిస్తున్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు