Aap Party | సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజల్లో తిరగాలని అనుకుంటారు. ఎందుకంటే మరోసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి కాబట్టి. కానీ ఓ మాజీ మంత్రి మాత్రం ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో వెంటనే యూట్యూబర్ గా మారిపోయాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేస్తేనే కోట్లాది ఆస్తులు సంపాదించుకుంటారు. పైగా మంత్రిగా చేసిన వ్యక్తికి యూట్యూబర్ గా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ (Aap Party) ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది.
ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటు మంత్రులు దాదాపు అందరూ ఓడిపోయారు. గ్రేటర్ కైలాష్ నుంచి పోటీ చేసిన ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా ఓడిపోయాడు. బీజేపీ అభ్యర్థి శిఖారాయ్ చేతిలో 3వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. దీంతో అతను నిరుద్యోగ నేత అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాడు. ఎన్నికల్లో ఓడిపోయాక నిరుద్యోగిగా మారిపోయానని.. ఆప్ పార్టీలో చాలా మంది పరిస్థితి ఇలాగే ఉందంటున్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో ఓడిపోయిన తన జీవితం ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నాడు. ప్రజలు కూడా ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే తనకు ఇవ్వొచ్చంటూ చెబుతున్నాడు ఈయన.