GHMC: పాలక మండలి చివరి సమావేశానికి ముహూర్తం ఖరారు..?
GHMC (imagacredit:twitter)
Telangana News, హైదరాబాద్

GHMC: జీహెచ్ఎంసీ పాలక మండలి చివరి కౌన్సిల్ సమావేశానికి ముహూర్తం ఖరారు..?

GHMC: జీహెచ్ఎంసీ పాలక మండలి చివరి కౌన్సిల్ సమావేశానికి ఎట్టకేలకు అధికారులు ముహూర్తం ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెల 10వ తేదీతో పాలక మండలి అధికార గడువు ముగియనుండటం, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావటంతో ఎపుడు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై కసరత్తు చేసిన అధికారులు ఎట్టకేలకు ఈ నెల 31వ తేదీన ఉదయం పదిన్నర గంటల నుంచి స్పెషల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27)కు సంబంధించి ఇప్పటికే అధికారులు రూ. 11 వేల 460 కోట్లతో రూపకల్పన చేసిన బడ్జెట్ పై చర్చ జరిపి, ఆమోదించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేకంగా కార్పొరేషన్ బడ్జెట్ ప్రధాన అజెండాగా ఈ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

స్వల్పంగా మార్పులు చేర్పులు

సమావేశానికి ముందే సభ్యులందరికీ బడ్జెట్ ముసాయిదాను సర్క్యులేట్ చేయనున్నట్లు తెలిసింది. గత నెల 29 న జరిగిన స్టాండింగ్ కమిటీ లో బడ్జెట్ పై చర్చ జరిగింది. స్టాండింగ్ కమిటీ అభిప్రాయాలను స్వీకరించినానంతరం అధికారులు ప్రస్తుత బడ్జెట్ ముసాయిదాలో అవసరమైన స్థాయిలో స్వల్పంగా మార్పులు చేర్పులు చేసిన బడ్జెట్ ను 31న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ రూపకల్పన, కేటాయింపులు, పెట్టుబడులు, వ్యయం వంటి వాటిపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదించినానంతరం తదుపరి ఆమోదం కోసం సర్కారుకు పంనున్నట్లు సమాచారం. కానీ బడ్జెట్ లోని కేటాయింపులు, 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానంతరం మౌలిక వసతులు, అభివృద్దికి జరిపిన కేటాయింపులపై గళం విన్పించేందుకు విపక్షాలు సిద్దమవుతున్నట్లు తెలిసింది.

Also Read: Vijay Career: విజయ్ దేవరకొండ గ్రాఫ్ తగ్గడానికి కారణం ఇదే.. తరుణ్ భాస్కర్

బడ్జెట్ స్వరూపం ఇదీ

వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26)నకు సంబంధించి రూ.10714.73 కోట్ల బడ్జెట్ తో పోల్చితే వచ్చే వార్షిక బడ్జెట్ రూ. 745.27 కోట్లు పెంచి రూ. 11 వేల 460 కోట్లతో రూపొందించారు. జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్ ముసాయిదాను రూపొందించారు. స్టాండింగ్ కమిటీ అభిప్రాయాలను స్వీకరించిన అధికారులు వచ్చే నెల రెండో వారంలో బడ్జెట్ పై నిర్వహించనున్న స్పెషల్ కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కౌన్సిల్ లో చర్చ జరిగి, బడ్జెట్ ను ఆమోదించిన తర్వాత తదుపరి ఆమోదం కోసం సర్కారుకు పంనున్నారు. ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల అసరాలు, అభివృద్ది, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్ ముసాయిదాను రూపొందించినట్లు సమాచారం. భవన నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలతో పాటు ప్రధాన ఆర్థిక వనరుల నుంచి ఆదాయం సమకూరుతున్నందున ఈ సారి రెవెన్యూ ఆదాయాన్ని రూ. 6441 కోట్లుగా పొందుపరిచారు. దీనికి తగినట్టుగానే రెవెన్యూ వ్యయాన్ని కూడా రూ. 4 వేల 57 కోట్లుగా పేర్కొన్నారు. ​మొత్తం బడ్జెట్ పరిమాణం రూ. 11,460 కోట్లు కాగా, వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్ రూ.10714.73 కోట్ల బడ్జెట్ తో పోల్చితే వచ్చే వార్షిక బడ్జెట్ ను రూ. 745.27 కోట్లు పెంచి రూపకల్పన చేసిన ఈ బడ్జెట్ కు త్వరలోనే కౌన్సిల్ ఆమోదం తీసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు.
Also Read: ​Trains Cancelled: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విశాఖ – విజయవాడ మార్గంలో.. పలు రైళ్లు రద్దు, లిస్ట్ ఇదే!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?