Chiranjeevi Fitness: మెగాస్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా?..
Chiranjeevi-Fitness(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi Fitness: మెగాస్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా?.. అయ్యబాబోయ్ ఏంటి బాసూ మీరు చేసేది..

Chiranjeevi Fitness: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘మెగాస్టార్’గా దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న చిరంజీవి గారు, 70 ఏళ్ళు దాటినా నేటి తరం హీరోలకు పోటీగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా ‘విశ్వంభర’, మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాల్లో ఆయన కనిపిస్తున్న ‘వింటేజ్ లుక్’ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నటుడు హర్షవర్ధన్ ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారి డైట్ బాడీ మెయింటెనెన్స్ గురించి వెల్లడించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన విజయం వెనుక ఉన్న కఠోర శ్రమ అర్థమవుతుంది.

Read also-Arijit Retirement: సంగీత ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ప్లేబ్యాక్ సింగింగ్‌కు అరిజిత్ సింగ్ వీడ్కోలు

పరిమిత ఆహారం – కఠిన నియమాలు చిరంజీవి గారి ఫిట్‌నెస్‌లో ప్రధాన పాత్ర పోషించేది ఆయన ఆహారపు అలవాట్లు. షూటింగ్ సెట్స్‌లో అందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేసినప్పటికీ, చిరంజీవి మాత్రం చాలా మితంగా ఆహారం తీసుకుంటారు. హర్షవర్ధన్ మాటల్లో చెప్పాలంటే, “మేము పప్పు అన్నం ముగించేలోపే, ఆయన తన భోజనాన్ని పెరుగు అన్నంతో సహా పూర్తి చేస్తారు”. అంటే ఆయన తీసుకునే క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎంతటి రుచికరమైన పదార్థాలు ఉన్నా, తన శరీరానికి అవసరమైనంత మాత్రమే తినడం ఆయన ప్రత్యేకత. అంటూ చెప్పుకొచ్చారు.

చక్కెర పదార్థాలకు దూరం వయసు పెరిగే కొద్దీ ముఖంలో వచ్చే మార్పులను నియంత్రించడానికి చిరంజీవి గారు చక్కెర వినియోగాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. చక్కెర మానేయడం వల్ల ముఖంపై ఉండే అనవసరపు కొవ్వు (Face Fat) తగ్గి, దవడ ఎముకలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల ఆయన 40 ఏళ్ళ క్రితం నాటి వింటేజ్ లుక్‌ను తిరిగి పొందగలిగారు. బాడీ కమాండ్, వర్కవుట్స్ చిరంజీవి గారికి తన శరీరంపై అద్భుతమైన నియంత్రణ ఉంది. యవ్వనంలో ఆయన చేసిన క్లిష్టమైన డ్యాన్స్ స్టెప్పులు, ఫైట్స్ వెనుక ఉన్న కమాండ్ ఇప్పటికీ అలాగే ఉందని హర్షవర్ధన్ పేర్కొన్నారు. షూటింగ్ క్యాన్సిల్ అయినా లేదా కాస్త విరామం దొరికినా ఆయన విశ్రాంతి తీసుకోకుండా తన వర్కవుట్ షెడ్యూల్‌ను పూర్తి చేస్తారు. వర్షం పడి షూటింగ్ ఆగినా సరే, తన ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ఆయన ఎప్పుడూ రాజీ పడరు.

Read also-Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. ఎంజాయ్!

చిరంజీవిని కాపాడే శివశంకర్ వరప్రసాద్ హర్షవర్ధన్ ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. శివశంకర్ వరప్రసాద్ అనే వ్యక్తి ‘చిరంజీవి’ అనే మెగాస్టార్ ఇమేజ్‌కు అతిపెద్ద అభిమాని. ఆ ఇమేజ్‌ను కాపాడటానికి, ప్రేక్షకులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే కనిపించడానికి ఆయన నిరంతరం శ్రమిస్తారు. ఈ మోటివేషనే ఆయనను ఆహారం విషయంలో కంట్రోల్‌గా ఉండేలా, జిమ్‌లో కష్టపడేలా చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఫిట్‌నెస్ కేవలం జిమ్ వర్కవుట్ల మీద మాత్రమే ఆధారపడి లేదు. అది ఆయన మానసిక నిశ్చయం, తిండిపై నియంత్రణ మరియు వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం ఫలితం. నేటి తరం యువతకు ఆయన ఒక గొప్ప స్ఫూర్తిప్రదాత. అని చెప్పిన హర్ష వర్థన్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?