Tharun Bhascker: మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) లీడ్ రోల్‌లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi). ఈషా రెబ్బా (Eesha Rebba) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో AR సజీవ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని టీమ్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో హీరోయిన్ ఈషా రెబ్బాతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి తరుణ్‌కి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.
Also Read- S Thaman: ఇక థమన్ పని అయిపోయినట్లేనా? కేవలం బాలయ్య చిత్రాలే దిక్కా!
ఇద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందా?
వాస్తవానికి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనేలా టాక్ నడుస్తూ వస్తుంది. ఇద్దరూ కనబడే తీరు, హాజరవుతున్న ఫంక్షన్స్ అన్నీ కూడా వారిద్దరినీ వార్తలలో ఉండేలా చేస్తున్నాయి. అందుకే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అది పెళ్లిగా పీటల వరకు వెళుతుందనేలా ఇండస్ట్రీలో ఒకటే వార్తలు. ఈ విషయంలో వారిద్దరూ మాత్రం అసలు విషయం ఏంటనేది చెప్పడం లేదు. కేవలం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ప్రమోషన్స్ కోసమే ఇలా యాక్ట్ చేస్తున్నారా? నిజంగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందా? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే, సినిమా ప్రమోషన్స్ కోసం, సీరియల్స్‌ని టాప్‌లో ఉంచడం కోసం, పెళ్లి కాకుండానే పెళ్లి అయినట్లుగా కొన్ని సీన్స్ చిత్రీకరించి, సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్న రోజులివి. అందుకే ఏదీ నమ్మడానికి లేదు. అందుకే మీడియా డైరెక్ట్‌గా వారిని ఎక్కడ కనబడితే అక్కడ ఈ ప్రశ్న అడిగేస్తుంది.
Also Read- Vishwak Sen: మనం పెట్టిన రాకెట్ అటు, ఇటు తిరిగి.. తరుణ్ భాస్కర్‌పై విశ్వక్ పంచులే పంచులు!
సర్వస్వంగా మారింది
ఇక వారి రిలేషన్‌షిప్‌పై తరుణ్ భాస్కర్ తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈషా రెబ్బా తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదని, ఆమె తన జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈషా తనకు సర్వస్వంగా మారిందని చెప్పారు. తమ మధ్య ఉన్న బంధం గురించి సరైన సమయంలో అధికారికంగా వెల్లడిస్తానని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన దానిని బట్టి చూస్తే.. ఇద్దరి మధ్య నిజంగానే రిలేషన్ నడుస్తుందనేది అర్థమవుతోంది. మరి ఆ బంధాన్ని ఎప్పుడు అఫీషియల్‌గా బయటపెడతారో? ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో తెలియాలంటే మాత్రం.. ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే. తప్పదు మరి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

