Mega Twins: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంట సంక్రాంతి సంబరాలు ఇంకా ముగియకముందే, మరో భారీ వేడుకకు రంగం సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త ఇప్పటికే అధికారికంగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈసారి డబుల్ ధమాకా అనేలా వార్తలు ఎప్పటి నుంచో మొదలయ్యాయి. ఇప్పుడు ఆ వారసులు ఎప్పుడు భూమిపైకి అడుగుపెడతారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. జనవరి 31న మెగా వారసులు ఈ లోకంలోకి రాబోతున్నారట. ఉపాసన రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి ఈసారి పుట్టబోయేది కవలలే అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గతేడాది జరిగిన సీమంతం వేడుకలో ఉపాసన చేసిన సోషల్ మీడియా పోస్ట్ దీనికి బలం చేకూర్చింది.
Also Read- S Thaman: ఇక థమన్ పని అయిపోయినట్లేనా? కేవలం బాలయ్య చిత్రాలే దిక్కా!
మెగా సంబరాలు మొదలయ్యేది అప్పుడే..
‘డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ బ్లెస్సింగ్స్’ అంటూ ఆమె ఇచ్చిన హింట్ మెగా అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. ఇప్పుడు జనవరి 31న ఆ ట్విన్స్ (Mega Twins) రాకతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం రెట్టింపు కానుంది. ఇటీవల మెగా నివాసంలో జరిగిన ఓ ప్రత్యేక విందులో ఉపాసన కనిపించారు. ఆ ఫొటోల్లో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుండటంతో, డెలివరీ సమయం దగ్గరపడిందనేది వాస్తవమని తేలిపోయింది. మొదటి సంతానం క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీకి అదృష్టం కలిసి వచ్చిందని భావించే అభిమానులు, ఇప్పుడు రాబోయే కవలలు కూడా మెగాస్టార్‌కు, చరణ్ కెరీర్‌కు మరింతగా కలిసొస్తుందని మెగా ఫ్యాన్స్ ఎంతగానో నమ్ముతున్నారు. అందులో ఇప్పుడు డబుల్ ఆనందం. అలాగే మెగాస్టార్ కోరుకుంటున్న వారసుడు కాదు, వారసులు అనేలా టాక్ నడుస్తుంది కాబట్టి.. మెగా సంబరాలకు ఇక అంతే ఉండేదేమో..
Also Read- Vishwak Sen: మనం పెట్టిన రాకెట్ అటు, ఇటు తిరిగి.. తరుణ్ భాస్కర్‌పై విశ్వక్ పంచులే పంచులు!
అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
సాధారణంగా మెగా ఫ్యామిలీ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంది. క్లీంకార పుట్టినప్పుడు కూడా అపోలో హాస్పిటల్స్ నుంచి అధికారికంగా బులెటిన్ విడుదలయ్యే వరకు ఎవరూ ధృవీకరించలేదు. ఇప్పుడు కూడా జనవరి 31 డేట్ విషయంలో మెగా కాంపౌండ్ మౌనంగానే ఉన్నా, సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ రోజున మెగా వారసులు రావడం పక్కా అని తెలుస్తోంది. ఒకవేళ కవలలు గనుక పుడితే, టాలీవుడ్ అగ్ర హీరోల కుటుంబాల్లో కవల పిల్లలకు జన్మనిచ్చిన మొదటి జంటగా చరణ్-ఉపాసన నిలుస్తారు. ఇప్పటికే ‘మెగా ట్విన్స్’ (Mega Twins) అనే హ్యాష్ ట్యాగ్‌తో ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టేశారు. మెగా ఫెస్టివల్‌కి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

