Jana Nayagan: ‘జన నాయగన్’ విడుదల ఇప్పట్లో లేనట్టే..
A man with an intense look sitting at a table in a dramatic film still, symbolizing tension and conflict.
ఎంటర్‌టైన్‌మెంట్

Jana Nayagan: ‘జన నాయగన్’ విడుదల ఇప్పట్లో లేనట్టే.. వ్యవహారం మళ్లీ మొదటికి!

Jana Nayagan: ద‌ళ‌ప‌తి విజ‌య్‌ (Thalapathy Vijay) నటించిన చివరి చిత్రంగా చెప్పుకుంటున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) చిత్రానికి ఇంకా సినిమా కష్టాలు వీడలేదు. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా, సెన్సార్ సమస్యలతో కోర్టుల చుట్టూ తిరుగుతుంది. పోలీస్ స్టేషన్‌లో కనుక కేసు పెట్టడానికి వెళితే, మీరు ఈ స్టేషన్ పరిధికి రారు, ఆ స్టేషన్‌కు వెళ్లాలి అంటూ ఎలా అయితే తిప్పుతారో.. ఈ సినిమా టీమ్‌ని కోర్టులు అలా తిప్పుతున్నాయి. అటు తిరిగి, ఇటు తిరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్లి కూడా మళ్లీ ఈ సినిమా వ్యవహారం మొదటికే వచ్చింది. అవును, అంతా కామెడీగా ఉంది. ఒక స్టార్ హీరో సినిమా విడుదల కావడానికి ఇన్ని కష్టాలు అనుభవించాలా? ఎంత, ఎలాంటి పొలిటికల్ డైలాగ్స్ ఉంటే మాత్రం ఇంతగా ఇబ్బంది పెట్టాలా? ఆ పొలిటికల్ డైలాగ్స్‌తో ఎవరైనా మారతారా? లేదంటే, విజయ్‌కి పొలిటికల్‌గా పేరు వస్తుందని భావించి, వాటిని తీయించాలని చూస్తున్నారా? అసలు ఈ సినిమాకు అడ్డుపడుతున్న అదృశ్య శక్తి ఎవరు? స్టేటా? సెంట్రలా? అనేలా.. రకరకాలుగా ఈ సినిమా విషయంలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ గురించి చెప్పేదేముంది?

Also Read- Vishwak Sen: మనం పెట్టిన రాకెట్ అటు, ఇటు తిరిగి.. తరుణ్ భాస్కర్‌పై విశ్వక్ పంచులే పంచులు!

మళ్లీ మొదటికే..

సరే విషయంలోకి వస్తే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరోసారి టీమ్‌కు షాక్ తగిలింది. ఈ సినిమాకు యుబైఏ సర్టిఫికేట్ ఇవ్వాలని గతంలో మద్రాస్ సింగిల్ బెంచ్ తీర్పుని ఇచ్చింది. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఆ తీర్పును తోసి పుచ్చి, మరోసారి క్షుణ్ణంగా విచారణ జరిపి, సరైన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్‌నే ఆదేశించింది. అంటే అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ మొదటికే వచ్చిందన్నమాట. ముందుగా ఈ సినిమా సెన్సార్ గురించి చెప్పుకుంటే.. జనవరి 9న ఈ సినిమాకు యుబైఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలిచ్చింది. ఆ వెంటనే సిబిఎఫ్‌సి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించగా, సెన్సార్ సర్టిఫికెట్‌పై ఆ బెంచ్ తాత్కాలిక స్టే విధించింది. ఈ స్టే ని సవాల్ చేస్తూ.. చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌ (KVN Productions) సుప్రీంకోర్టుకు వెళ్లింది.

Also Read- Barabar Premistha: ‘మళ్లీ మళ్లీ’.. ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి మాంచి రొమాంటిక్ ట్రాక్ వదిలారు

ఈ సినిమా మాత్రం బ్లాక్‌బస్టర్

సుప్రీంకోర్టు కూడా చేతులెత్తేసి.. మీరు మద్రాసు డివిజన్ బెంచ్‌ దగ్గరే తేల్చుకోవాలని సూచనలు చేసింది. జనవరి 21న డివిజన్ బెంచ్ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ వాదనల అనంతరం మరోసారి విచారణ జరిపి సరైన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్‌ని డివిజన్ బెంచ్ ఆదేశించింది. సెన్సార్ బోర్డుకు వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని, రివైజింగ్ కమిటీకి వెళ్లిన దానిపై కూడా పూర్తిగా విచారణ చేయాలని సింగిల్ బెంచ్ జడ్జికి డివిజన్ బెంచ్ తెలిపినట్లుగా తెలుస్తోంది. సో.. ఇవన్నీ అయ్యేదెప్పుడు? ఈ సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడు? అంటే, కరెక్ట్‌గా డేట్ చెప్పడం మాత్రం కష్టమే. ఒక సినిమా కోసం నిజంగా ఇంకో సినిమానే జరుగుతుంది అక్కడ? ‘జన నాయగన్’ విడుదలై హిట్టవుతుందో? లేదో తెలియదు కానీ, ఈ సినిమా చుట్టూ జరుగుతున్న సినిమా మాత్రం బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఒక సినిమాను తొక్కడానికి ఇంత చేయాలా? అయినా, ఎందుకు ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని మేకర్స్ పట్టుబడుతున్నారు. చక్కగా ఓటీటీలో విడుదల చేసి, ఫ్రీ గా ప్రేక్షకులకు చూపిస్తే సరిపోతుంది కదా? అనే వారు కూడా లేకపోలేదండోయ్! ఏమో చివరికి అదే జరిగినా జరగొచ్చు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?