Kavitha on BRS: సందర్భం చిక్కితే చాలు.. బీఆర్ఎస్ పార్టీ (BRS), ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు హరీష్ రావు (Harish Rao), సంతోష్ రావులపై (Santosh Rao) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడుతున్నారు. తాజాగా, మరోసారి సంతోష్ రావు టార్గెట్‌గా కవిత సెన్సేషనల్ కామెంట్స్ (Kavitha on BRS) చేశారు.
‘‘బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఉద్యమ నాయకుడు.. ఉద్యమకారులకు దూరమయ్యారంటే, పేద ప్రజలకు దూరమయ్యారంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమయ్యారంటే, గద్దర్ వంటి పెద్ద పెద్ద నాయకులు గేటు బయట నిలబడ్డారంటే, ఈటల రాజేందర్ లాంటి నాయకులు పార్టీ వీడి బయటకు వచ్చారంటే, అన్ని దుర్మార్గాలకు సెంటర్ పాయింట్, మొదటి దెయ్యం సంతోష్ రావే. మరి ఆ సంతోష్ రావుని ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ పిలిచిందని చెబుతున్నారు. కానీ, ఈ ముఖ్యమంత్రికి ఉన్న ప్రధానమైన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ సగం ఇడ్లీ తిన్నారా?, ఫుల్ ఇడ్లీ తిన్నారా? అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి, ఈ గూఢాచారికి ఈ గుంపు మేస్త్రీ శిక్ష వేస్తారో లేదో నాకైతే తెలియదు. నాకు నమ్మకం కూడా లేదు. సిట్ పిలవడం వరకు బాగానే ఉంది. కానీ, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా గమనించుకోవాలి. సంతోష్ రావు లాంటి దుర్మార్గుడికి హరీష్ రావు, కేటీఆర్ స్విట్స్ ఇవ్వడం ఏంటి?, వత్తాసు పలకడం ఏంటి? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. మొదటి నుంచి అందరినీ కన్నీళ్లు పెట్టించిన దెయ్యం ఈ వ్యక్తి. చట్టం కరెక్ట్‌గా పనిచేస్తే ఈ వ్యక్తికి కచ్చితంగా శిక్ష పడుతుంది. కానీ, సంతోష్ రావుని గుంపు మేస్త్రీ కాపాడుకుంటాడని తాను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితి రాకుండా పోలీసులు పకడ్బంధీగా, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కోరుతున్నాను. ఒక్కోసారి మన నీడను కూడా మనం గుర్తుపట్టలేం. ఇతరుల నీడ పడి కళ్లు కప్పుకుపోవచ్చు. కేసీఆర్ విషయంలో ఇదే జరిగింది. సంతోష్ రావు దుర్మార్గుడు. మొదటి దెయ్యం’’ అని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also- Aruri vs Kadium: కడియం టార్గెట్‌గా ఆరూరి ఎంట్రీ.. ఉపఎన్నిక కోసం పక్కా స్కెచ్.. వర్కౌట్ అయ్యేనా?
సంతోష్‌రావుపై ఫుల్ గుస్సా!
పార్టీని, పార్టీ అధినేతను కమ్మేసిన ఒక అదృశ్య నీడ సంతోష్ రావు అని కవిత సంబోధించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. అతడిపై కోపం గట్టిగానే ఉన్నట్టుగా స్పష్టమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొదటి దెయ్యం, దుర్మార్గుడు అని సంబోధిస్తూ కవిత మాట్లాడిన తీరు చూస్తుంటే, అతడిపై గట్టిగానే గురిపెట్టినట్టుగా కనిపిస్తోంది.
కేసీఆర్‌ను ఇరికించిన కవిత?
సంతోష్ రావుపై విరుచుకుపడే క్రమంలో తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రజలకు కేసీఆర్ దూరమయ్యారంటూ కవిత అభివర్ణించారు. సంతోష్ రావుని లక్ష్యంగా చేస్తూ అన్న ఈ మాటలు వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు, అంతర్గత పోరు కనిపిస్తున్నట్టుగా ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. వ్యూహాత్మకంగా సంతోష్ రావు పేరిట కేసీఆర్ ప్రజలు దూరమయ్యారని చెబుతున్నట్టుగా ఉందన్నారు. కేసీఆర్ తప్పు చేయకపోయినా, ఆయన చుట్టూ ఉన్న దుష్ట శక్తులు ఆయన కళ్లు కప్పి దూరం చేశారంటూ అనడం చూస్తుంటే, కేసీఆర్ ఇమేజ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టే చేసి, బీఆర్ఎస్ పనైపోయిందని అంటున్నారు.
ఉద్యమకారులు, గద్దర్ వంటి ప్రజా గాయకులు, అమరవీరుల కుటుంబాలు సైతం దూరమయ్యాయని చెప్పడం ద్వారా.. తాను పెట్టబోయే పార్టీ వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కవిత వ్యాఖ్యలను కేసీఆర్ ఇప్పుడైనా పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి మరి!.

