Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. రీసెంట్గా వచ్చిన ‘దేఖ్ లేంగే సాలా’ మూవీ తర్వాత ఈ మూవీ నుంచి సరైన అప్డేట్ రాలేదు. మధ్యలో నిర్మాతలు ఈ సినిమాను ఏప్రిల్ రిలీజ్ చేస్తామని ప్రకటించడం తప్ప, సంక్రాంతికి కూడా సరైన అప్డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ను వదిలారు. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని తెలుపుతూ, అందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Harish Shankar: అనిల్ రావిపూడికి చిరు కారు గిఫ్ట్.. హరీష్ శంకర్ రియాక్షన్ చూశారా!
కల్ట్ కెప్టెన్ ఆన్ ద డ్యూటీ..
హరీష్ శంకర్ కలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ పవన్ కళ్యాణ్ అంటే ఆయన పెన్ను మరింతగా వర్క్ చేస్తుంది. మాస్ మెచ్చే సంభాషణలకు పేరుగాంచిన హరీష్ శంకర్‌ను అభిమానులు ఈ విషయంలో ముద్దుగా ‘కల్ట్ కెప్టెన్’ అని పిలుస్తుంటారు. ఆ పేరుకి తగ్గట్టుగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కల్ట్ చిత్రంగా మలచడానికి ఆయన శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు తీసుకెళుతున్నారు. కారణం ఈ సినిమా మార్చిలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తుండటమే. ఈ సినిమా అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లేలా.. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే, ప్రేక్షకుల చేత ఈలలు వేయించే సంభాషణలకు ఈ చిత్రం హామీ ఇస్తుందని ఈ సందర్భంగా చిత్రబృందం తెలుపుతోంది.
Also Read- Anil Ravipudi: రాజమౌళితో పోల్చవద్దు.. నేను అన్నేళ్లు టైమ్ తీసుకోలేను
ఇకపై ఫ్యాన్స్‌కు పండగే..
ఇంకా ఈ అప్డేట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్నారని మేకర్స్ తెలపడంతో.. ఇది అభిమానులలో, సినీ ప్రేమికులలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. అందులోనూ ‘ఓజీ’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కూడా కావడంతో.. కచ్చితంగా మరో హిట్ పడుతుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపై ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్లను ఒక్కొక్కటిగా వరుసగా వదులుతామని నిర్మాతలు తెలుపుతున్నారు. అంటే, ఇకపై ఫ్యాన్స్‌కి పండగే అన్నమాట. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
#UstaadBhagatSingh dubbing begins on an auspicious note…🔥🔥🔥
Get ready for the POWERFUL DIALOGUES penned by our CULT CAPTAIN 🔥🔥#PawanKalyan #HarishShankar #Sreeleela #RaashiiKhanna #MythriMovieMakers #Celebs #Tollywood #tollywoodactress #entertainment #Bigtv… pic.twitter.com/bisPaJmNeZ
— BIG TV Cinema (@BigtvCinema) January 27, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

