Telangana Govt: జర్నలిస్టులకు గుడ్ న్యూస్
Telangana Govt ( image crdit: twitter)
Telangana News

Telangana Govt: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. సామాన్య పరిపాలన శాఖ నుంచి కొత్త జీవో రిలీజ్!

Telangana Govt:  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు-2025లో కీలక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో 252లో సవరణలు చేస్తూ, సామాన్య పరిపాలన శాఖ జీవో 103ని విడుదల చేసింది. ఈ కొత్త సవరణల ద్వారా డెస్క్ జర్నలిస్టులకు, వివిధ కేటగిరీల పత్రికలకు పెద్ద ఊరట లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా మహిళా జర్నలిస్టులకు ఈ కొత్త నిబంధనల్లో పెద్దపీట వేశారు. ప్రతి మీడియా సంస్థ తమ డెస్క్ జర్నలిస్టుల విభాగంలో తప్పనిసరిగా 33 శాతం మహిళలను నియమించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రిడిటేషన్ కార్డుల కేటాయింపులో కూడా మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

Also Read: Telangana Govt: చిన్నారుల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టి.. సరైన చికిత్స అందించేందుకు వైద్యారోగ్య శాఖ ఫొకస్!

సర్క్యులేషన్ ఆధారంగా కార్డులు

రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీలో ‘ప్రెస్ క్లబ్ హైదరాబాద్’ ప్రతినిధితో పాటు, ‘బిగ్ డైలీ న్యూస్ పేపర్’ నుంచి డెస్క్ జర్నలిస్ట్ ప్రతినిధికి కూడా సభ్యత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా అదనపు కార్డులను కేటాయించనున్నారు. 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు, 1.50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో ఒక అదనపు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్, కల్చర్, ఫిల్మ్ విభాగాల్లో అదనపు కార్డులు లభించనున్నాయి. గత జీవోలో ఉన్న మీడియా కార్డ్ అనే పదాన్ని ఇకపై ‘అక్రిడిటేషన్ కార్డ్’గా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉర్దూ పత్రికల కేటగిరీలోనూ కీలక సవరణలు చేశారు.

Also Read: Telangana Govt: విద్యుత్ సబ్సిడీల్లో అన్నదాతదే అగ్రభాగం.. వ్యవసాయ రంగానికి రూ.13,499 కోట్లు!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?