K Raghavendra Rao: ‘‘మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘ఇంద్ర’ (Indra Movie) సినిమాలో వీణ స్టెప్ చూసిన తర్వాత.. డ్యాన్స్‌లో నిన్ను కొట్టేటోడు లేడని ఆరోజే చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. అదే గ్రేస్‌తో డ్యాన్స్ చేశాడు’’ అని అన్నారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. అప్పుడు శ్రీదేవి ఉంది కాబట్టి అతిలోకసుందరిగా ఆమెను అనుకున్నాం. ఇప్పుడు ‘జగదేక వీరుడు’, అతిలోక సుందరి’ కూడా చిరంజీవేనని దర్శకేంద్రుడు చెప్పుకొచ్చారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, వెంకీ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao) మాట్లాడుతూ..
Also Read- Nadeem Khan: ఇంటి పనిమనిషిపై లైంగిక వేధింపుల కేసులో ‘ధురంధర్’ నటుడు అరెస్ట్..
ఎన్టీఆర్ కంటే చిరుతోనే ఎక్కువ
‘‘ఈ విజయం నిర్మాతలైన సుస్మిత, సాహులకు మరింత బాధ్యతని పెంచింది. చిరంజీవి, అల్లు రామలింగయ్య మేమందరం చిన్నప్పటి నుంచి ఒక కుటుంబం లాగా పెరిగాము. స్వర్గీయ ఎన్టీ రామారావుతో 12 సినిమాలు చేస్తే చిరంజీవితో 14 సినిమాలు చేశాను. చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా చేస్తే బాగుంటుందని ఒక విత్తనాన్ని నాటాను. ఆ విత్తనం ఈరోజు మహావృక్షంగా మారింది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా చివర్లో జాయిన్ అవ్వడం కలెక్షన్ల దుమ్ము దులిపేసింది. ఇద్దరూ కలిసి పోటీపడి మరి చేశారు. చిరంజీవికి వయస్సు లేదు. నా జగదేక వీరుడు, అతిలోకసుందరి కూడా తనే. ఈ సినిమాలో నయనతారతో చిలిపిగా మాట్లాడే విధానం నిజంగా సుందరిని తలపిస్తుంది. చిరంజీవి వయస్సు రహస్యం ఏమిటని మా ఇంట్లోని వారంతా నన్ను అడుగుతుంటారు.
Also Read- Murali Mohan: లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది.. పద్మశ్రీపై మురళీ మోహన్ స్పందనిదే!
సంక్రాంతికి చిరు సంజీవని..
ఒక రోజు నేను ఫ్లైట్‌కి వెళ్లాలి. టైమ్ అవుతుంది, ‘ఇంద్ర’ సినిమా టైమ్. అశ్వనీదత్ ఫోన్ చేసి ఒక పాట చూడాలి రమ్మన్నారు. సరేలే అని వెళ్లాను.. ‘వీణ’ స్టెప్ చూసి చిరంజీవి లాగా డాన్స్ చేసే హీరో మళ్ళీ పుట్టడని ఆయనకి ఆరోజే కాల్ చేసి చెప్పాను. 30 ఏళ్ల క్రితం ఎలా డాన్స్ చేశారో.. ఇప్పటికి కూడా అదే గ్రేస్‌తో చేశారు. నేను మొదటి కారు కొన్నప్పుడు ఎన్టీఆర్‌ని ఎక్కించుకుని వెళ్లాను. పెద్ద దర్శకుడిని అయ్యాను. ఇప్పుడు అనిల్ రావిపూడి, చిరంజీవిని ఎక్కించుకుని వెళ్లాడు. తను కూడా పెద్ద దర్శకుడు అవుతాడు. సంక్రాంతి సమయానికి ఇండస్ట్రీ చాలా డల్‌గా ఉంది. చిరంజీవి సంజీవనిని తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీని బతికించారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ మంచి ఎఫర్ట్ పెట్టారు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’’ అని దర్శకేంద్రుడు చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

