Kishan Reddy: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణిని నిలువునా దోచుకుంటున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. కొత్తగూడెం బీజెపి కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో టిఆర్ఎస్ పార్టీ సింగరేణి ఉద్యోగులకు సరైన జీతాలు చెల్లించక ఇబ్బందులకు గురిచేసిందని గుర్తు చేశారు. పార్టీలు మారుతూ సింగరేణిని నష్టపరిచేందుకు వాటాల రూపంలో దోచుకుంటున్నారని విమర్శించారు. గత కొంతకాలంగా సింగరేణి పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం చేసుకుంటున్న విమర్శల నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణి సంస్థ నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్నారు.
Also Read: Kishan Reddy: కూనంనేని వ్యాఖ్యలు హేయమైనవి.. కిషన్ రెడ్డి ఫైర్!
సింగరేణి ఆగం చేయాలని కంకణం
ఆ క్రమంలోనే కార్యకర్తల సమావేశంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ఆగం చేయాలని కంకణం కట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సింగరేణిని ఆదుకుంటామని స్పష్టం చేశారు. సింగరేణిని అడ్డంగా దోచుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సరైన గుణపాఠం చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినవాడు బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినవాడు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారని ఆరోపించారు. కమిషన్ల కక్కుర్తి కోసం సింగరేణిని ఆగం చేస్తామంటే బీజెపి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
Also Read: Kishan Reddy: బస్తీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ఎక్కడక్కడంటే?

