Republic Day 2026: రిపబ్లిక్ డే (జనవరి 26)ను పురస్కరించుకొని తెలంగాణలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి.. తెలంగాణ ప్రభుత్వం తరపున భవిష్యత్ లక్ష్యాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం.. గత రెండేళ్లలో గణనీయమైన విజయాలను సాధించిందని గవర్నర్ పేర్కొన్నారు.
‘తెలంగాణ రైజింగ్ విజన్ – 2047’
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు పూర్తైన సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 అనే దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించిందని గవనర్ జిష్ణుదేవ్ వర్మ గుర్తుచేశారు. దీని ద్వారా ప్రభుత్వం సమగ్ర, సమానమైన, సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించిందన్నారు. ఈ విజన్ డాకుమెంట్‌లో రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా సమతుల్య అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందన్న గవర్నర్.. ఇది తెలంగాణను మూడు ఆర్థిక మండలాలుగా విభజించనుందని చెప్పారు. క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) లక్ష్యాలతో రాష్ట్రంలో సమతుల్య, సమానమైన, సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం విశసిస్తోందన్నారు.
మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు ప్రణాళికలు
తెలంగాణ రైజింగ్ – 2047 ప్రణాళిక ద్వారా గాంధీ సరోవర్ ప్రాజెక్టు(బాపూఘాట్), గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, డ్రై పోర్టులు, రెండో దశ మెట్రో రైలు, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్ల మధ్య రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణం జరగబోతున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్నా – గపూర్, హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – విజయవాడ పారిశ్రామిక కారిడార్లను నిర్మించనున్నారని చెప్పారు. ఇవన్నీ 2047 నాటికి తెలంగాణను దేశ పురోగతిలో కీలక పాత్రధారిగా నిలబెడతాయని జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రజా ప్రభుత్వం.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కలెక్టరేట్ల వద్ద తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు , ‘జయ జయ హే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగిందన్నారు.
Also Read: Ponguleti Srinivasa Reddy: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడమే లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!
సంక్షేమానికి పెద్ద పీట
మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కేటాయింపు, హైటెక్ సిటీ సమీపంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు, ఓన్డీసీ వేదికల ద్వారా డిజిటల్ మార్కెటింగ్ వైపు అడుగులు, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటివి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధికి సైతం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు జిష్ణుదేవ్ వర్మ స్పష్టం చేశారు. రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం పంపినీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, చేనేత రంగానికి చేయూత చేస్తున్నట్లు తెలిపారు. సమగ్రపట్టణాభివృద్ధి కోసం జీహెచ్ఎంసీని విస్తరించి 27 మున్సిపాలిటీలను విలీనం చేయడం జరిగిందని గవర్నర్ చెప్పుకొచ్చారు.
Republic Day Celebrations at Parade Ground https://t.co/FtaUcO1Qgo
— Telangana Congress (@INCTelangana) January 26, 2026

