Uttam Kumar Reddy: మున్సిపోరులో కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తాం
Uttam Kumar Reddy ( image credit: twitter)
Telangana News

Uttam Kumar Reddy: మున్సిపోరులో కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Uttam Kumar Reddy: పురపాలక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. అందుకే స్వచ్ఛందంగా కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.  ఆయన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

Also Read: Uttam Kumar Reddy: అవినీతి, అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఊపేక్షించేది లేదు.. వారికి మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

నోటిఫికేషన్ మరో మూడు రోజుల్లో విడుదల

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ మరో మూడు రోజుల్లో విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు రాకుంటే అధైర్య పడొద్దని, వారికి నామినేటేడ్ పదవులు ఇస్తామన్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ, 90 శాతం మున్సిపల్‌లను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలును బీజేపీ అడ్డుకుందని మండిపడ్డారు. మున్సిపల్‌లలో అధికార కాంగ్రెస్‌ పార్టీ జెండాలు ఎగరవేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Uttam Kumar Reddy: మున్నేరు, పాలేరుకు రూ.162.57 కోట్లు.. ఆకస్మిక వరదలతో జరిగే నష్టాలకు చెక్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?