MLA Kadiyam Srihari: స్టువర్టుపురం దొంగలు వస్తున్నారు జాగ్రత్త!
MLA Kadiyam Srihari (imagecredit:swetcha)
Telangana News, నార్త్ తెలంగాణ

MLA Kadiyam Srihari: మనదగ్గరికి స్టువర్టుపురం దొంగలు వస్తున్నారు జాగ్రత్త: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

MLA Kadiyam Srihari: తెచ్చిన నిధులు తేనట్టు.. జరుగుతున్న అభివృద్ధి తామే చేసినట్టు చెప్పుకుంటూ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు స్టువర్టుపురం దొంగలు వస్తున్నారు జాగ్రత్తని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శనివారం బిఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇక్కడ ఉన్నోడే పెద్ద గజ దొంగ ఇప్పుడు ఆ గజ దొంగకు తోడు మరో ముగ్గురు స్టువర్టుపురం దొంగలు వచ్చారని, ఈ దొంగలతో జాగ్రత్తగా ఉండాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ప్రజల కోరారు. నిన్న కొంత మంది బిఆర్ఎస్ నాయకులు స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, ఈనాడు ఇక్కడ నిర్మాణం అవుతున్న 100 పడకల హాస్పిటల్, ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, ఘనపూర్ మున్సిపాలిటీ కావడానికి మేమే కారణం అన్న రీతిలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో మంజూరైన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలన్నింటిని ప్రభుత్వ ఉత్తర్వులతో సహా మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టడం జరిగిందని తెలిపారు. అన్ని తెలిసి కూడా గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని తెలిసి గత ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి మరిచిపోయి జల్సాలకు అలవాటు పడి నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.

ప్రజలు తలదించుకునే పరిస్థితులు

ఇక్కడ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 100 పడకల అస్పత్రి, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, ప్రస్తుతం నడుస్తున్న డిగ్రీ కాలేజ్, నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కావడం, దానికి 50 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు కావడం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే మంజూరు అయ్యాయని వెల్లడించారు. గత ఎమ్మెల్యే వలన ఏ రకంగా నష్టం జరిగిందో ఏ రకంగా చెడ్డ పేరు వచ్చిందో అందరికి తెలుసని అన్నారు. ప్రతిదీ కూడా అవినీతిమయం చేసి, తన చిల్లర పనుల ద్వారా ప్రజలు తలదించుకునే పరిస్థితులు తీసుకొచ్చారని ఆరోపించారు. 2023లో జరిగిన ఎన్నికలలో ఆయనకు టికెట్ రాకపోవడానికి, రాజయ్యకి టికెట్ ఇస్తే మనం గెలవమని కేసీఆర్ కి చెప్పింది అప్పటి మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ ముగ్గురే నని తెలిపారు. కేసిఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర రాజయ్యకు వ్యతిరేకంగా చెప్పి ఈయనను ప్రజలే తిరస్కరిస్తున్నారని చెప్పిన ఈ ముగ్గురే ఇప్పుడు ఇక్కడ ఇంచార్జ్ లుగా వేసుకున్నారని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ లో రాజయ్యను డమ్మీ చేసి ఒకరేమో బీజేపీ నాయకున్ని తీసుకురావాలని, మరొకరేమో ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ను తీసుకురావాలని, ఇంకొకరేమో కాంగ్రేస్ నాయకులను తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఇది రాజయ్యకు అర్థం కావడం లేదని విమర్శించారు.

Also Read: Padma Awards 2026: పద్మశ్రీ అవార్డుల ప్రకటన.. ఇద్దరు తెలుగు వ్యక్తులకు పురస్కారం.. ఎవరెవరంటే?

చెవిటోడు ఎర్రబెల్లి.. మతి బ్రమించి మాట్లాడుతున్నాడు

ఎర్రబెల్లి దయాకర్ రావు మనవరాలు వయసు ఉన్న అమ్మాయి చేతిలో ఓడిపోయేసరికి చిన్న మెదడు చితికిపోయి మతి బ్రమించి సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ఏద్దేవా చేశారు. టిడిపిని హోల్ సేల్ గా కేసీఆర్కు అమ్మిన నీచపు చరిత్ర నీదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారలోకి రాగానే కాంగ్రేస్ పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేశావ్ కానీ నీ నీచ చరిత్ర రేవంత్ రెడ్డి నిన్ను రానివ్వలేదని అన్నారు. మనం మాట్లాడే సభ్యతను బట్టే ఎదుటి వారి సంస్కారం ఉంటుందని హితవు పలికారు.

కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేసిందే పల్లా

కేసీఆర్ చుట్టూ బొచ్చు కుక్కలా తిరిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ పేరు చెప్పుకొని వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడని ఆరోపించారు. కవిత కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలు ఉన్నాయని చెప్పినట్టు అందులో పెద్ద కొరివి దయ్యం పల్లా రాజేశ్వర్ రెడ్డి అని అన్నారు. కేసీఆర్ పక్కనే ఉంటూ కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టడాని, పల్లా రాజేశ్వర్ రెడ్డే కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేశాడని ఆరోపించారు.

కేటీఆర్, సంతోష్ రావుల బినామీ పోచంపల్లి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొట్టోడు అంటున్నారు కానీ అసలైన పొట్టోడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నే అని విమర్శించారు. కేటీఆర్, సంతోష్ రావుల బినామీ పోచంపల్లి అన అన్నారు. కేటీఆర్, సంతోష్ రావు సంపాదించిన డబ్బులని ఈయన ద్వారా రియల్ ఎస్టేట్లో ఖర్చు పెడుతున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో గెలిచేందుకు ఎన్ని డబ్బులు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. అందుకే ఈ ముగ్గురు ఇంచార్జ్ లుగా వచ్చారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న స్టేషన్ ఘనపూర్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దీనిని ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా అభివృద్ధి జరగదని అన్నారు. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని మున్సిపాలిటీ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, నియోజకవర్గ నాయకులు సిహెచ్ నరేందర్ రెడ్డి, నీల నరసింహులు, వెంకన్న, చిరంజీవి, సారంగపాణి, నూకల ఐలయ్య, నీలగట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read: Gadwal News: మార్కెట్ యార్డ్ ప్రహరీ గోడ కూల్చి.. దర్జాగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు..?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?