Husnabad Municipality: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పర్యటించారు. దాదాపు 26 కోట్ల రూపాయల తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి రెండు సంవత్సరాల్లో చేసి చూపించమని మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేలా కాంగ్రెస్ పార్టీనీ ఆశీర్వదించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ కి గత రెండేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వెల్లడించారు. హుస్నాబాద్ అంటే వెంటనే స్పందించేలా రాష్ట్రంలో మంచి గుర్తింపు తీసుకొచ్చానని ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలతో పాటు గతంలో జరిగిన పార్లమెంట్ ,ఎమ్మెల్సి ఎన్నికల్లో ఇచ్చిన మద్దతు తాజాగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఉండాలని కోరారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి హుస్నాబాద్ సస్య శ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక్కడే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్..
హుస్నాబాద్ – కరీంనగర్, హుస్నాబాద్ – అక్కన్నపేట మధ్య నాలుగు లైన్ ల రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం చేస్తున్నామని ఇక్కడి ప్రజలకు 24 గంటలు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉండేలా 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, పీజీ కాలేజీ రావడంతో పాటు ఇక్కడే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉండనున్నారని పేర్కొన్నారు. త్వరలోనే చౌటపల్లి వద్ద ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ వస్తుందని తెలిపారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఈరోజు కొత్త చెరువు 7.79 కోట్లు, పల్లె చెరువు, ఎల్లమ్మ చెరువు కాలువల పునరుద్ధరణకు మరో 3 కోట్లు రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నామని పేర్కొన్నారు.
Also Read: US Winter Storm: తీవ్ర మంచు తుపాను గుప్పిట్లో అమెరికా.. 13 వేల విమానాలు రద్దు
చిల్డ్రన్ పార్క్‌కి శంకుస్థాపన
గత వర్షాకాలంలో హుస్నాబాద్ లో 32 సెంటీమీటర్ల వర్షం పడితే డ్రైనేజీ సమస్య వచ్చిందనీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. హుస్నాబాద్ అభివృద్ధి లో కుల సంఘాల భవనాలు,మున్సిపాలిటీ సుందరీకరణ, అర్బన్ ఫారెస్ట్ ట్రెక్కింగ్, రాయికల్ వాటర్ ఫాల్స్, మహా సముద్రం గండి, భైరవ స్వామి గుడి టూరిజంగా మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇండోర్ స్టేడియం వద్ద స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామని, మోడల్ స్కూల్ పక్కన ఉన్న ఖాళీ ప్రాంతంలో చిల్డ్రన్ పార్క్ కి శంకుస్థాపన చేసుకున్నామని సూచించారు. 4 కోట్ల రూపాయలతో దేవతల బావి, పాత ఎమ్మార్వో ఆఫీస్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నల్ల వాడుతున్న వారికే పన్ను ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి తలమానికమైన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కి ముఖ్యమంత్రి తో శంకుస్థాపన చేసుకునీ శాశ్వత భవనాలు నిర్మాణం చేసుకుంటున్నామని తెలిపారు. 8.5 కోట్లతో ఆర్టీఏ కార్యాలయం శంకుస్థాపన చూసుకొని అధునాతన హంగులతో డ్రైవింగ్ ట్రాక్ సైతం నిర్మిస్తామన్నారు. హుస్నాబాద్ లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆరు ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధి చేసుకున్నామని భీమదేవరపల్లిలో నవోదయ పాఠశాల తీసుకొస్తమని హామీ ఇచ్చారు.
Also Read: Nithiin36: నితిన్‌కు ఈ దర్శకుడైనా హిట్ ఇస్తాడా? నితిన్36 ఎవరితో అంటే?

