Virat Kohli | ఇంగ్లండ్ తో మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా 356 పరుగుల భారీ స్కోర్ చేసి ఆల్ ఔట్ అయింది. హిట్ మ్యాన్ రోహిత్ (1) ఈ సారి కూడా నిరాశ పరిచాడు. కానీ మరో ఓపెనర్ గిల్ తో కలిసి శ్రేయర్ అయ్యర్, కోహ్లీ అద్భుతంగా రాణించారు. శుభ్ మన్ గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు 3 సెక్సులతో విరుచుకుపడ్డాడు. అతనికి తోడుగా శ్రేయస్ అయ్యర్ 64 బంతుల్లో 78 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ ఆటను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాడు. వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.
కోహ్లీ 55 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ తో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ ముగ్గురి భారీ స్కోర్లు ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచేలా చేశాయి. గిల్ మంచి దూకుడు మీద ఉన్నప్పుడే ఔట్ అయ్యాడు. అతను 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో వచ్చిన హార్థిక్ పాండ్యా 9 బంతుల్లో 17 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. వాషింగ్టన్ సుందర్ (14), అక్షర్ పటేల్(13), హర్షిత్ రాణా (13) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4, మార్క్ వుడ్ 2, సకిబ్, అట్కిన్సన్, జోరూట్ ఒక్కో వికెట్ తీసారు. మొత్తంగా 50 ఓవర్లు ఆడిన టీమిండియా 10 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది.