Eco Tourism: సోమశిల తెలంగాణ పర్యాటకానికి మణిహారం
Eco Tourism (imagecredit:swetcha)
Telangana News, మహబూబ్ నగర్

Eco Tourism: సోమశిల సౌందర్యం తెలంగాణ పర్యాటకానికి మణిహారం: మంత్రి జూపల్లి కృష్ణారావు

Eco Tourism: నల్లమల అడవుల మధ్య కృష్ణమ్మ ఒడిలో ఒదిగి ఉన్న సోమశిల పర్యాటక కేంద్రం ఆధ్యాత్మికతకు, ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన గమ్యస్థానమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishn Rao) అన్నారు. ఆదివారం ఆయన సోమశిల ఎకో టూరిజం పార్కును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి కృష్ణా నది, ప్రకృతి అందాలను వీక్షించారు. సోమశిల తీరం నుంచి ఎకో పార్కు వరకు మంత్రి బోటులో విహరించారు. అక్కడి ప్రకృతి అందాలను, అటవీ, పర్యాటక శాఖ కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రకృతి అందాలు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సోమశిల – శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్‌లో ప్రకృతి అందాలు పర్యాటక ప్రేమికుల్ని సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇక్కడి వ్యూ పాయింట్ వద్ద ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయని, ముఖ్యంగా ఎకో పార్కు పరిసరాల్లోకి అప్పుడప్పుడు పులులు వంటి వన్యప్రాణులు రావడం ఇక్కడి పర్యాటకానికి మరింత ఆకర్షణను తెస్తుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు, దేశ విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేలా సోమశిలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

Also Read: Telangana Police: మేడారంలో పిల్లలు తప్పిపోయారా? కంగారుపడొద్దు వారి కోసమే ఈ కొత్త విధానం అందుబాటులోకి?

ఐదు గంటల పాటు..

సోమశిల ప్రాంతం కేవలం విహార కేంద్రంగానే కాకుండా 15 శివాలయాల సముదాయంతో ఆధ్యాత్మిక క్షేత్రంగానూ అలరారుతోందని ఆయన గుర్తు చేశారు. పర్యాటకుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) సోమశిల నుండి శ్రీశైలం వరకు ఐదు గంటల పాటు సాగే ప్రత్యేక బోటింగ్ సేవలను అందిస్తోందని, ఈ ప్రయాణంలో నదీ తీర అందాలను చూస్తూ సాగే ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తుందని చెప్పారు. మృగవాణి, సమీపంలోని మల్లెల తీర్థం, పాలధార, పంచదార వంటి జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పర్యాటక సంపదను ప్రపంచానికి పరిచయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

Also Read: Love Affair Revenge: ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని కలలో కూడా ఊహించని పనికి పాల్పడ్డ ప్రియురాలు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?