BRS Party: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్‌పై (ABN Andhra Jyothy) విపక్ష బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆంక్షలు విధించింది. ఆ ఛానల్‌కు చెందిన ప్రతినిధులను పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌తో (Telangana Bhavan) పాటు అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లోకి అనుమతించబోమంటూ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఏబీఎన్ ఛానల్లో జరిగే డిబేట్లలో ఇక నుంచి బీఆర్ఎస్ నాయకులు పాల్గొనబోరని క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఆంధ్రజ్యోతికి ఉన్నదని ప్రకటనలో బీఆర్ఎస్ పేర్కొంది. తెలంగాణ భవన్లో కానీ, జిల్లా కార్యాలయాల్లో కానీ జరిగే పార్టీ సమావేశాలకు ఏబీఎన్ ఛానల్ ప్రతినిధులను అనుమతించరాదని పార్టీ నిర్ణయించిందని పేర్కొంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ నోట్ విడుదల చేశారు.
Read Also- Love Affair Revenge: ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని కలలో కూడా ఊహించని పనికి పాల్పడ్డ ప్రియురాలు
డిబేట్లో వివాదం!
శుక్రవారం నాడు (జనవరి 23) ఏబీఎన్‌లో ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావుని ‘గెట్ ఔట్ ఆఫ్ మై ఛానల్’ అని సదరు ఛానల్ వ్యాఖ్యాత అన్నారని బీఆర్ఎస్ ప్రస్తావించింది. డిబేట్లో పాల్గొన్న అతిథి మీద ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఎమ్మెల్సీ రవీందర్ రావుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ పట్ల, తెలంగాణ పట్ల ఆంధ్రజ్యోతి వైఖరి మారకపోవడంతో ఇకపై బీఆర్ఎస్ నాయకులు ఎవరూ ఆ ఛానల్ చర్చల్లో పాల్గొనకూడదని నిర్ణయించామని తెలిపింది.

