Nampally Fire Accident: నాంపల్లిలోని బచాస్ ఫర్నిచర్ షాపులో (Nampally Fire Accident) శనివారం సంభవించిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్నవారి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. రంధ్రం చేసి సెల్లార్‌లోకి ప్రవేశించిన రెస్క్యూ బృందం ఐదుగురి మృతదేహాలను గుర్తించింది. ముగ్గురి డెడ్‌బాడీలను బయటకు తీసుకొచ్చారు. ఈ మూడు మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరి డెడ్‌బాడీలలో ఒకరు బాలుడిగా, మరొకటి పురుషుడుగా గుర్తించారు. మరో డెడ్‌బాడీ బేబి అనే మహిళగా నిర్ధారణ చేశారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ బృందం కృషి చేస్తోంది. ప్రస్తుతం 200 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి? అని తెలుసుకునేందుకు అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. బాధితులు ఎలా చిక్కుకున్నారు?, ఎలా చనిపోయారు? అనే కోణాలను పరిశీలిస్తున్నారు. బచాస్ ఫర్నీచర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
శనివారం మధ్యాహ్నం ప్రమాదం
ఈ ఘోర అగ్ని ప్రమాదం శనివారం మధ్యాహ్నం 12.30 సమయంలో సంభవించింది. ప్రమాదానికి గురైన బిల్డింగ్‌లో సతీష్ గుప్తా అనే వ్యక్తి గత సంవత్సరాలుగా ఫర్నిచర్ వ్యాపారాలను నిర్వహిస్తున్నాడు. ఈ బిల్డింగ్‌లో రెండు సెల్లార్లు ఉన్నాయి. తొలుత ఒ ఓ సెల్లార్‌లో మొదలైన మంటలు ఆ తర్వాత భవనం మొత్తం వ్యాపించాయి. ఓ సెల్లార్‌లో ముగ్గురు వాచ్‌మెన్‌ల కుటుంబాలు అక్కడే ఉంటున్నాయి. అందులో ఒక ఫ్యామిలీకి చెందిన ప్రణీత్ (12 ఏళ్లు) అఖిల్ (8 సంవత్సరాలు) అనే పిల్లలు చిక్కుకున్నారు. వారితో మిగతా మృతులు కూడా చిక్కుకున్నారు. కాగా, మంటలు తీవ్రత, పొగ ధాటికి రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా సంక్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. 20కి పైగా ఫైరింజన్లు ఉపయోగించాల్సి వచ్చిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read Also- Bullet Bikes Thieves: దొంగలు దొరికారు.. వామ్మో ఎన్ని బుల్లెట్స్ దొరికాయో తెలుసా?

