Srinath Maganti: టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ ఆర్టిస్టుల్లో శ్రీనాథ్ మాగంటి ఒకరు. ‘హిట్’ ఫ్రాంచైజీలో అభిలాష్ పాత్రలో ఆయన నటన ప్రశంసలు అందుకున్నారు. ‘లక్కీ భాస్కర్’లోనూ సూరజ్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ‘యానిమల్’తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. ఆ సినిమాలో రష్మిక బ్రదర్ రోల్ చేశారు. ఇప్పుడు శ్రీనాథ్ మాగంటి క్రేజీ ప్రాజెక్టులో హీరోగా నటించనున్నారు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన కల్ట్ ఫిల్మ్ ‘ఈ నగరానికి ఏమైంది’. ఆ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. నలుగురు స్నేహితుల చుట్టూ నడిచే కథతో ‘ఈ నగరానికి ఏమైంది’ తీశారు తరుణ్ భాస్కర్. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, స్నేహం నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు.
Read also-Prabhas Spirit: ‘ది రాజాసాబ్’ నిర్మాతకు ‘స్పిరిట్’ తెలుగు రైట్స్.. మొత్తం తెలిస్తే షాక్ అవుతారు
‘ఈ నగరానికి ఏమైంది 2’ స్క్రిప్ట్ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రాశారు. అందులో శ్రీనాథ్ మాగంటి ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. హీరోల్లో ఆయన కూడా ఒకరు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో కార్తీక్ పాత్ర పోషించిన సుశాంత్, ‘ఈ నగరానికి ఏమైంది 2’లో నటించడం లేదని తరుణ్ భాస్కర్ తెలిపారు. సుశాంత్ లేకపోయినా కార్తీక్ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు ఆ రోల్ శ్రీనాథ్ మాగంటి చేస్తున్నారా? వెయిట్ అండ్ సి. తరుణ్ భాస్కర్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Read also-Megastar Catherine: మెగాస్టార్‌కు కలిసొచ్చిన ఆ హీరోయిన్ ప్రజెన్స్.. ఎవరంటే?
సుశాంత్ రెడ్డి దూరం..
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ‘కార్తీక్’ పాత్రతో అందరినీ మెప్పించిన సాయి సుశాంత్ రెడ్డి, ఆ సినిమా సీక్వెల్ ‘ENE Repeat’ (ఈ నగరానికి ఏమైంది 2) నుండి తప్పుకోవడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. సుశాంత్ తన వ్యక్తిగత కారణాల వల్ల నటనకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. జీవితంలో ప్రాధాన్యతలు మారాయని, ప్రస్తుతం తన సమయాన్ని ఇతర బాధ్యతలకు కేటాయించాల్సి వస్తోందని ఆయన స్వయంగా వెల్లడించారు. సుశాంత్ ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన తన కుటుంబ వ్యాపారాలను ఆస్తులను చూసుకోవడంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, ఆయన తన వ్యాపార బాధ్యతల పట్ల పూర్తి ఆసక్తితో ఉన్నారు. నటన కంటే వ్యాపార రంగంలోనే స్థిరపడాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఈ నగరానికి ఏమైంది’ తర్వాత ‘బొంబాట్’, ‘థాంక్యూ’ వంటి సినిమాల్లో నటించినా, ఆయన ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. దీంతో ఆయన నటనకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

