Raakaasaa Glimpse:‘మ్యాడ్’ (MAD) ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’(Raakaasaa). తాజాగా ఈ సినిమా కు సంబంధించి గ్లింప్స్ విడుదల అయ్యాయి. ఈ చిత్రం సంగీత్ శోభన్ కెరీర్‌లో సోలో హీరోగా వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. గతంలో అతను నటించిన చిత్రాలన్నీ మల్టీస్టారర్ లేదా గ్యాంగ్ డ్రామాలు కాగా, ఇందులో పూర్తి స్థాయి కథానాయకుడిగా మెప్పించబోతున్నాడు. ఇది ఒక ఫాంటసీ కామెడీ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మానస శర్మ ఈ చిత్రంతో వెండితెరకు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఈమె ‘బెంచ్ లైఫ్’ అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై, జీ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయ్ ఫేమ్ నయన్ సారిక సంగీత్ శోభన్ కు జోడీగా నటిస్తోంది. చిత్ర బృందం ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసింది. ఈ సినిమాను ఏప్రిల్ 3, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read also-Tarun Bhascker: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ చూశారా?.. ఎటకారాలు ఓకే ప్రతీకారాలే?
టాలీవుడ్‌లో తనదైన టైమింగ్ మరియు కామెడీతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సంగీత్ శోభన్. ‘మ్యాడ్’ (MAD) సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు ‘రాకాస’ (Raakaasaa) అనే వెరైటీ టైటిల్‌తో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘జీ స్టూడియోస్’ (Zee Studios) ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇది నిహారిక బ్యానర్‌లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ విడదులైన గ్లిప్స్ చూస్తుంటే.. సంగీత్ శోభన్ తన దైన శైలిలో మెప్పించారు. ఫాంటసీ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాను చూసేందుకు ప్రాక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Balagam Venu: వివాదంలో ‘ఎల్లమ్మ’ దర్శకుడు.. అలా చేసినందుకు హిందూ సంఘాలు ఆగ్రహం

