Daggubati Family: దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు..
Daggubati-Family
ఎంటర్‌టైన్‌మెంట్

Daggubati Family: దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు.. లీగల్ టీమ్ ఏం చెప్పిందంటే?

Daggubati Family: ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబానికి చెందిన హీరోలు మరోసారి నాంపల్లి కోర్టుకు మరో సారి గైర్హాజరయ్యారు. దగ్గుబాటి హీరోలు పలుమార్లు కోర్టుకు రాకపోవడం గమనార్హం. దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోకుండా హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, అభిరామ్ లు తమ పరపతిని ఉపయోగించి 2022 నవంబర్, 2023 జనవరి నెలల్లో జీహెచ్ఎంసీ సిబ్బందితో హోటల్‌ను పూర్తిగా కూల్చివేయించారని ఆరోపించారు. హోటల్‌ను కూల్చి వేసినప్పుడు పెద్ద సంఖ్యలో బౌన్సర్లను కూడా అక్కడికి పంపించారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. అంటూ దగ్గుబాటి కుటుంబంపై వస్తున్న వార్తలను ఆ ఫ్యామిలీ ఖండించింది. దగ్గుబాటి కుటుంబం తరఫు న్యాయవాది ఇలా వస్తున్న వార్తలపై స్పందించారు. ఇలాంటి వార్తలు అవాస్తవమని, వాటిని ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనికి సంబంధించి దగ్గుబాటి లీగల్ టీన్ నోటీస్ విడుదల చేసింది.

Read also-Peddi Special Song: ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్ కోసం రెడీ అవుతున్న టాప్ హీరోయిన్.. ఎవరంటే?

ఆ వార్తలు అవాస్తవం

దగ్గుబాటి ఫ్యామిలీపై వస్తున్న వార్తలను ఖండిస్తూ వారి లీగల్ టీమ్ నోట్ విడుదల చేశారు. అందులో ఏం చెప్పారంటే?.. దగ్గుబాటి ఫ్యామిలీ పై వస్తోన్న వార్తలు అవాస్తవం, కోర్ట్ కి హాజరు కావాలన్నది పచ్చి అబద్ధం జూబ్లీహిల్స్ డెక్కన్ కిచెన్ కేసు విషయంలో నాంపల్లి కోర్టులో దగ్గుబాటి కుటుంబానికి చుక్కెదురైందని. కోర్టు ఆర్డర్లను ధిక్కరించినందుకు జడ్జి సీరియస్ అయ్యారని.. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్టు వస్తోన్న వార్తలు నిజం కాదు. వచ్చే నెల 5 న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. సహజంగానే కేసు 05/02/2026కి వాయిదా పడింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వాస్తవాలను ప్రచారం చేయవద్దని కోరుతున్నాము. తప్పుడు వివరాలు ప్రచురించితే చట్టపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అంటూ లీగల్ టీమ్ చెప్పుకొచ్చింది.

Read also-Anil Ravipudi: వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తానంటున్న అనిల్ రావిపూడి.. టైటిల్ ఇదే!

 

Just In

01

Ban on Drone: పరేడ్ గ్రౌండ్స్​ వద్ద డ్రోన్లపై నిషేధం.. ఇందుకు కారణం ఏంటంటే

Bandi Sanjay On KTR: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై మరోసారి బండి సంజయ్ ఆరోపణలు

KCR-BRS: ఉద్యమకారుడు జగదీష్ కుటుంబానికి అండగా కేసీఆర్.. చెక్కు అందజేత

Vegetable Prices: కొండెక్కుతున్న కూరగాయల ధరలు.. ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

RCB Ownership: ఆర్సీబీను కొనేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లీ సతీమణి.. ఎంతంటే?