Anil Ravipudi: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మెగాస్టార్ హీరోగా వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అనిల్ రావిపూడి తర్వాత తీయబోయే సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇప్పటికే అనిల్ రావిపూడి తనకు ఐడియా వచ్చేసిందని, స్టోరీ లైన్ చాలా గమ్మత్తుగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా టైటిల్ కూడా రెడీ గా ఉందని, కాస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. అంటే సినిమా దాదాపు సిద్ధం అయిపోయిందని తెలుస్తోంది. మళ్లీ సంక్రాంతికి రెడీ అవుతున్నాము అని కూడా అనిల్ రావిపూడి కన్ఫామ్ చేసేశారు. తాజాగా అందిన సమాచారం ఎంటంటే ఓ ప్రముఖ నిర్మాత ‘అదరిపోద్దీ సంక్రాంతి’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి టైటిల్ అనిల్ రావిపూడి మాత్రమే వాడతాడని, ఇది ఖచ్చితంగా ఆయన సినిమానే అయి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త ఎంత వరకూ నిజమే తెలియాలంటే అనిల్ రావిపూడి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. వరుసగ తొమ్మిది హిట్లు అందించిన అనిల్ రాబోయే పదో సినిమా ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Sasirekha Video Song: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి ‘ఓ శశిరేఖా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. చూసేయండి మరి

