Telangana Govt: మందుల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షనే
Telangana Govt ( image credit: swetcha reporter)
Telangana News

Telangana Govt: మందుల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షనే.. ఫార్మసిస్టుల పనితీరుపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్!

Telangana Govt: ప్రభుత్వ ఆసుపత్రులు, వెల్‌నెస్ సెంటర్లలో రోగులకు మందులు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) హెచ్చరించింది. క్షేత్రస్థాయిలో కొందరు ఫార్మసిస్టుల అలసత్వం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదులను సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. సకాలంలో మెడిసిన్ ఇండెంట్ పంపని పక్షంలో తక్షణమే సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు గట్టి వార్నింగ్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో కొందరు ఫార్మసిస్టుల అలసత్వం వల్ల రోగులకు సకాలంలో మందులు అందడం లేదని, దీనివల్ల ప్రజలు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆసుపత్రుల్లో ఉన్న స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించి, మందులు అయిపోకముందే ఇండెంట్ పెట్టాల్సిన బాధ్యతను విస్మరించడంపై సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా స్పందించింది.

వరంగల్ ఫార్మసిస్ట్‌పై వేటు

మందుల పంపిణీలో నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారణ కావడంతో వరంగల్ వెల్‌నెస్ సెంటర్‌లో పనిచేస్తున్న ఫార్మసిస్ట్‌ను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఈ చర్యతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టుల్లో కలకలం మొదలైంది. స్టాక్ రిజిస్టర్లను సరిగా నిర్వహించకపోవడం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వంటి కారణాల వల్ల రోగులకు ఇబ్బంది కలిగితే ఏమాత్రం సహించేది లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం వహించే వారు తక్షణమే తమ పనితీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో కఠినమైన శాఖాపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం గట్టి సంకేతాలు పంపింది.

Also Read: Telangana Govt: చిన్నారుల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టి.. సరైన చికిత్స అందించేందుకు వైద్యారోగ్య శాఖ ఫొకస్!

డిజిటల్ మానిటరింగ్

మందుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం డిజిటల్ మానిటరింగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రతిరోజూ పంపిణీ అయిన మందుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయడంతో పాటు, నిల్వలు 20 శాతానికి చేరుకోగానే వెంటనే తదుపరి ఇండెంట్ పంపాలని ఆదేశించింది. ముఖ్యంగా ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ మందులు లేవనే సమాధానం రోగులకు చెప్పకూడదని, ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కేవలం ప్రైవేట్ ఫార్మసీలపై దృష్టి పెట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులు, వెల్‌నెస్ సెంటర్లలోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు.

ఫార్మసిస్టుల పనితీరుపై ప్రత్యేక నిఘా

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఫార్మసిస్టుల హాజరుతో పాటు, వారు రోగులతో వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మందుల కోసం వచ్చినప్పుడు స్టాక్ లేదని వెనక్కి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైద్య సేవలను బలోపేతం చేసే క్రమంలో సిబ్బంది పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన నైపుణ్య శిక్షణపై కూడా ఫోకస్ పెట్టినట్లు అధికారులు వివరించారు. ఈ తాజా చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టుల్లో కలకలం మొదలైంది.

Also Read: Telangana Govt: గ్లోబల్ సమ్మిట్‌లో ఆకట్టుకన్న నెట్ జీరో స్టాల్.. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ టార్గెట్!

Just In

01

KTR on SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేటీఆర్ విచారణ.. సంచలన వ్యాఖ్యలు

Raakaasaa Glimpse: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ వచ్చేశాయ్ చూశారా.. నిహారిక రెండో సినిమా

Veenvanka Anganwadi Centres: అంగన్వాడీ పౌష్టికాహారం పక్కదారి.. పసిపిల్లల ఆహారంపై అక్రమార్కుల కన్ను!

Groundnut Price: రికార్డ్ స్థాయిలో వేరుశనగ ధర.. తొలిసారి ఎంతకు పెరిగిందంటే?

Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లలో కలెక్టర్, ఎస్పీ ఫుల్‌ బిజీ.. ఎక్కడికక్కడ తనిఖీలు