Davos 2026: సీఎం రేవంత్ దావోస్ టూర్ విజయవంతం
Davos 2026
Political News

Davos 2026: సీఎం రేవంత్ దావోస్ టూర్ విజయవంతం.. 3 రోజుల్లో రూ.30వేల కోట్లు!

Davos 2026: తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగా, దావోస్‌లో 3 రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులోనూ తెలంగాణ ఆశించిన లక్ష్యాన్ని సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు అంచనా వేశాయి.

విజన్ డాక్యుమెంట్ ప్రదర్శన

వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సులో పెట్టుబడులతోపాటు తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే సంకల్పం నెరవేరినట్లు ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో ప్రతినిధుల బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగం, హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫాలోఅప్ ఫోరం నిర్వహించాలనే ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది. 3 రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల అనంతరం 3 రోజుల తెలంగాణ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన గురువారం సాయంత్రం ముగిసింది.

పెట్టుబడులతో పాటు విజన్ కూడా..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దావోస్ పర్యటనలో కేవలం పెట్టుబడులే కాకుండా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల ముందు ఆవిష్కరించింది. ముఖ్యమంత్రి దావోస్ వేదికపై నిర్వహించిన రెండు కీలక సెషన్లలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లో ‘వరల్డ్ ఎకనమిక్ ఫాలో అప్ ఫోరం’ నిర్వహించాలనే ఆయన ప్రతిపాదనకు అంతర్జాతీయ సమాజం నుండి సానుకూల స్పందన లభించింది. మూడు రోజుల వ్యవధిలో ఆయన 12 మంది ప్రపంచ స్థాయి కంపెనీల సీఈవోలు, పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ప్రభుత్వం కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా, భవిష్యత్తు అవసరాలైన ఏఐ, సస్టైనబిలిటీ, మరియు స్కిల్లింగ్ (నైపుణ్యాభివృద్ధి) కార్యక్రమాలపై పలు కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనివల్ల తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందడమే కాకుండా, పర్యావరణ హితమైన అభివృద్ధికి బాటలు పడనున్నాయి.

Also Read: Uttam Kumar Reddy: అవినీతి, అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఊపేక్షించేది లేదు.. వారికి మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

పర్యటన ముగింపు.. అమెరికా పయనం

గురువారం సాయంత్రంతో దావోస్ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూరిచ్ మీదుగా అమెరికా పర్యటనకు బయలుదేరారు. అక్కడ కూడా మరిన్ని పెట్టుబడుల వేటలో ఆయన నిమగ్నం కానున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి దావోస్ నుండి తిరిగి భారత్‌కు పయనమయ్యారు. మొత్తానికి ‘తెలంగాణ రైజింగ్’ నినాదం దావోస్ మంచు కొండల్లో గట్టిగా ప్రతిధ్వనించింది. ఈ పర్యటన ద్వారా వచ్చిన పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: BJP Telangana: మున్సిపోరుపై కమలం కసరత్తు.. ఉత్తర తెలంగాణపై ఫుల్ ఫోకస్!

Just In

01

UP Shocker: ఎంబీబీఎస్ సీటు కోసం.. కాలు నరుక్కున్న విద్యార్థి.. ఇదేం వెర్రితనం!

Tarun Bhascker: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ చూశారా?.. ఎటకారాలు ఓకే ప్రతీకారాలే?

Daggubati Family: దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు.. లీగల్ టీమ్ ఏం చెప్పిందంటే?

Govt School Neglected: భయపడి బడి మానేస్తున్న పిల్లలు!.. కలెక్టర్ గారూ కాస్త ఈ స్కూల్‌ను పట్టించుకోరూ!

Palnadu district Shocking: ప్రేయసి దూరం పెట్టిందని.. కోడికత్తితో ముక్కు కోసేశాడు.. వీడేంట్రా ఇలా ఉన్నాడు!