Harish Rao: మెదక్ ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరేస్తాం అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అన్నారు. స్థానిక సాయిబాలజీ గార్డెన్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సావిత్రి సురేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ టిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ అధ్యక్షతన సభ జరిగింది.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాను రద్దు చేసే కుట్ర చేస్తున్నారనీ ఆరోపించారు. మెదక్ జిల్లా జిల్లాగానే ఉండాలన్నా, అభివృద్ధి కొనసాగాలన్నా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలి. కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించాలనీ హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి,మాజీ ఎమ్మెల్సీలు ఫరూక్ హుస్సేన్, షేర్ సుభాష్ రెడ్డి,బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి,నియోజక వర్గం పార్టీ ఇంచార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి,పార్టీ సీనియర్ నేత లు బట్టి జగపతి,మల్లికార్జున్ గౌడ్,ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, ప్రభురెడ్డి,సోములు,మామిల్ల ఆంజనేయులు,జీవన్ రావు, గంగనరందర్,తదితరులు పాల్గొన్నారు.
Also Read: Harish Rao: బీఆర్ఎస్ దిమ్మెలను కూలగొడితే దిమ్మతిరిగేలా బదులిస్తాం
భారీ బైక్ ర్యాలీ
మెదక్ పట్టణంలో కొండన్ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులు పలువురు టిఆర్ఎస్ పార్టీలో చేరిక సందర్భంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుండి సాయి బాలాజీ గడ్డం వరకు సాయి బాలాజీ గార్డెన్ వరకు బారి ర్యాలీ నిర్వహించారు. హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ నేతలు మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సావిత్రి సురేందర్ గౌడ్,మాజీ కౌన్సిలర్లు కౌన్సిలర్లు పలువురు నేతలు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి హరీష్ రావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.ఇదిలా ఉండగా సంగారెడ్డి,నర్సాపూర్ మున్సిపాల్టీ లో ఆయా ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్,సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులు హరీష్ రావు నివాసంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.

