Sand Mining: ఇసుక అక్రమాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
Sand Mining (imagecredit:twitter)
Telangana News

Sand Mining: ఇసుక అక్రమాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక ఆన్‌లైన్ ట్రాన్‌జిట్ పాస్..!

Sand Mining: ఇసుక అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలతో పాటు ఓవర్ లోడ్‌కు చెక్ పెట్టింది. అయితే, మ్యాన్‌వల్‌తో వే బిల్లులు ఇస్తుండటంతో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన టీజీఎండీసీ కంప్యూటర్ ద్వారా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. అందుకోసం తొలుత రాష్ట్రంలోని నాలుగు జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆ జిల్లాల్లోని ఎండీసీ అధికారులకు శిక్షణ, తనిఖీలు తదితర అంశాలపై శిక్షణకు సిద్ధమైంది. ఇది సక్సెస్ అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయనుంది.

నాలుగు జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక..

ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖల్లో తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఎండీసీ) ఒకటి. అయితే అక్రమంగా ఇసుక రవాణాతో ప్రభుత్వానికి భారీగా గండి పడుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు చెక్ పెట్టేందుకు పలు సంస్కరణలు తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు మ్యాన్ వల్‌గా రిసిప్టులు జిల్లాలో ఇస్తున్నారు. దీంతో అక్రమాలకు కారణమవుతుందని గుర్తించిన ప్రభుత్వం దానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. కంప్యూటర్ ద్వారా వే బిల్లులు ఇస్తే పారదర్శకంగా ఇసుక సరఫరా జరుగుతుందని, అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చని భావించింది. అందుకు అనుగుణంగా తొలుత రాష్ట్రంలోని నాలుగు జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అందులో కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలను ఎంపిక చేసి ఆయా జిల్లాల్లోని ఏడీలు, పీఓలకు ‘మన ఇసుక వాహనం’పై శిక్షణ ఇస్తున్నారు. ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు కంప్యూటర్ ద్వారా వే బిల్లులు ఎలా ఇవ్వాలి?.. ఆన్‌లైన్ ట్రాన్‌జెట్ పాస్ తనిఖీ ఎలా చేయాలి? వినియోగదారులు సైతం ఆన్‌లైన్ ద్వారా ఎలా ఇసుక బుక్ చేసుకోవాలి.. వారికి వచ్చే ఓటీపీ, ఇసుక ఎంత సరఫరా .. పంచాయతీ కార్యదర్శులు ఎలా ఓకే చేయాలి.. ఎమ్మార్వో ధృవీకరణ, ఓకేతో సరఫరా.. రిజిస్ట్రేషన్ సమయంలో ఎలా నమోదు తదితర అంశాలను శిక్షణ ఇస్తున్నారు.

Also Read: Sangareddy District: చెల్లిని ప్రేమించాడని.. ప్రియుడ్ని అడవిలోకి తీసుకెళ్లి.. అన్నలు దారుణం!

ఎండీసీ అధికారులకు శిక్షణ..

‘మన ఇసుక వాహనం’ వెబ్‌సైట్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్(సీజీజీ) పర్యవేక్షణ చేస్తుంది. దీనిపై పూర్తిగా అవగాహన కోసం ఈ శిక్షణ దోహదపడనుంది. బుధవారం కొత్తగూడెం జిల్లాలోని ఎండీసీ అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. 23న నిజామాబాద్ జిల్లా అధికారులకు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే కంప్యూటర్ ద్వారా వే బిల్లు ఇచ్చినప్పటికీ తిరిగి ఇసుక రీచ్‌ల వద్ద చెకింగ్ కోసం ఒక సిబ్బందిని నియమించనున్నట్లు సమాచారం. ఆ సంబంధిత ఉద్యోగికి వే బిల్లు వాస్తవమా? లేదా నకిలీదా? అని తెలుసుకుని ఇసుక వాహనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా..

ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కంప్యూటర్ వే బిల్లులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. టీజీఎండీసీ ఎండీ, వీసీగా భవేష్ మిశ్రా ప్రభుత్వ ఆదేశాలతో ఇసుక అక్రమాల అడ్డుకట్టకు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా ఇసుక రీచ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో నిత్యం హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం కంప్యూటర్ వే బిల్లులతో ఆదాయం పెరగనుంది.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ విచారణపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Just In

01

UP Shocker: ఎంబీబీఎస్ సీటు కోసం.. కాలు నరుక్కున్న విద్యార్థి.. ఇదేం వెర్రితనం!

Tarun Bhascker: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ చూశారా?.. ఎటకారాలు ఓకే ప్రతీకారాలే?

Daggubati Family: దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు.. లీగల్ టీమ్ ఏం చెప్పిందంటే?

Govt School Neglected: భయపడి బడి మానేస్తున్న పిల్లలు!.. కలెక్టర్ గారూ కాస్త ఈ స్కూల్‌ను పట్టించుకోరూ!

Palnadu district Shocking: ప్రేయసి దూరం పెట్టిందని.. కోడికత్తితో ముక్కు కోసేశాడు.. వీడేంట్రా ఇలా ఉన్నాడు!