KCR: సిట్ విచారణ వివరాలపై ఆరా తీసిన గులాబీ బాస్ కేసీఆర్!
KCR (imagecredit:twitter)
Telangana News

KCR: సిట్ విచారణ వివరాలపై ఆరా తీసిన గులాబీ బాస్ కేసీఆర్..భయపడోద్దంటూ..?

KCR: కేసులు విచారణకు భయపడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) అన్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) వెళ్లారు. సిట్ విచారణ, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఫోన్ టాపింగ్ కేసులో సిట్ నోటీస్ ఇచ్చి ఏడున్నర గంటల పాటు చేసిన విచారణను హరీశ్ రావు వివరించారు. ఏయే వివరాలు అడిగారు, వారు అడిగిన తీరు, చెప్పిన సమాధానాలు, పోలీసులు అనుసరించిన విధానం తదితర అంశాలను వివరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్.. కాంగ్రెస్ చేసిందేమీ లేక విచారణలు, కేసుల పేరుతో వేధింపులకు దిగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వైఫల్యాలు ఎండగట్టాలని సూచించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం. క్యాడర్‌కు నేతలంతా అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి పంచేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

Also Read: Viral Video: అగ్గిపెట్టెంత ఇల్లు.. రూ.1.2 కోట్లు అంట.. కొనేవాళ్లు మరీ అంత పిచ్చోళ్లా!

విజయుడిపై దాడికి ఖండన

బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు‌పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన దాడిని ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు పేర్కొన్నారు. ‘ఎక్స్’ వేదికగా బుధవారం పేర్కొన్నారు. విజయుడుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం దారుణం, అప్రజాస్వామికం అన్నారు. ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రతినిధిపై దాడి అంటే ప్రజల తీర్పుపైనే దాడిగా అభివర్ణించారు. ఈ ఘటనను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేను బెదిరించడం, దాడి చేయడమేనా ప్రజా పాలన? అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన మల్లు రవిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: Saroor Nagar Lake: సరూర్ నగర్ చెరువుపై.. హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన

Just In

01

Daggubati Family: దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు.. లీగల్ టీమ్ ఏం చెప్పిందంటే?

Govt School Neglected: భయపడి బడి మానేస్తున్న పిల్లలు!.. కలెక్టర్ గారూ కాస్త ఈ స్కూల్‌ను పట్టించుకోరూ!

Palnadu district Shocking: ప్రేయసి దూరం పెట్టిందని.. కోడికత్తితో ముక్కు కోసేశాడు.. వీడేంట్రా ఇలా ఉన్నాడు!

PM SVANidhi Credit Card: ‘పీఎం స్వానిధి క్రెడిట్ కార్డ్’ ఆవిష్కరించిన మోదీ.. అసలేంటీ కార్డ్?, ఎవరికి ఉపయోగం?, వివరాలివే

TPCC Chief: యావత్ ఫ్యామిలీ.. అలీ బాబా దొంగల బ్యాచ్.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ చురకలు