Nidhhi Agerwal: ఆయన పీఎం అయినా ఆశ్చర్యపడను.. నిధి
nidhi-agrwal
ఎంటర్‌టైన్‌మెంట్

Nidhhi Agerwal: ఆయన పీఎం అయినా ఆశ్చర్యపడను.. నిధి అగర్వాల్.. ఎందుకంటే?

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల టాలీవుడ్ లో ఇద్దరు పెద్ద హీరోల సరసన నటించారు. దీంతో ఆమె క్రేజ్ అమాంతం ఆకాశానికి ఎదిగింది. ఇటీవల జరిగిన ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్య పరిచాయి. ముఖ్యంగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నా.. ఆయన ప్రధాని అయినా ఆశ్చర్య పడనని ఆమె చెప్పుకొచ్చారు.

Read also-Chiranjeevi Davos: సీఎం రేవంత్ రెడ్డితో పాటు ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026’లో పాల్గొన్న మెగాస్టార్..

అంతే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి దేవుడితో సమానమైన క్రేజ్ ఉందని, ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ విషయాన్ని స్వయంగా గమనించానని నిధి అగర్వాల్ పేర్కొన్నారు. ఆయన కూర్చునే విధానం, మాట్లాడే శైలి చాలా ఆకర్షణీయంగా ఉంటాయని, ఆయన చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకమైన ‘మాస్’ అప్పీల్ ఉంటుందని ఆమె వివరించారు. పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వారని, ప్రజలు సాధారణంగా మాట్లాడటానికి భయపడే విషయాలను కూడా ఆయన బహిరంగంగా, ధైర్యంగా మాట్లాడతారని చెప్పారు. బాక్సాఫీస్ విజయాలు లేదా పరాజయాలు ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపవని ఆమె అభిప్రాయపడ్డారు.

Read also-Sonu Sood Praises Pawan: డిప్యూటీ సీఎం పవన్‌పై సోనూసూద్ పొగడ్తలు.. వీడియో ఇదిగో

ఆయన గత చాలా ఏళ్లుగా రాజకీయాల్లో కష్టపడుతున్నారని, తన సొంత వ్యవస్థను, పార్టీని నిర్మించుకున్నారని తెలిపారు. ఆయన ఎప్పుడూ సరైన విషయం కోసమే నిలబడతారని, భవిష్యత్తులో ఆయన ప్రధానమంత్రి అయినా తాను ఆశ్చర్యపోనని నిధి అగర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసిపోయి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని, కేవలం పబ్లిసిటీ కోసం కాకుండా నిజమైన మార్పు కోసం ఆయన పనిచేస్తారని ఆమె పేర్కొన్నారు.

Just In

01

Viral Video: అగ్గిపెట్టెంత ఇల్లు.. రూ.1.2 కోట్లు అంట.. కొనేవాళ్లు మరీ అంత పిచ్చోళ్లా!

AR Rahman: ఏఆర్ రెహమాన్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఆర్జీవీ.. ఏం జరిగిందంటే?

Davos Summit 2026: దావోస్‌లో సీఎం దూకుడు.. రేవంత్ విజన్‌కు టాప్ కంపెనీలు ఇంప్రెస్.. మరో భారీ డీల్ సెట్!

Medchal News: అంబేద్కర్ భవన భూమి కబ్జాకు యత్నం కలకలం.. భూమిని కాపాడాలంటూ డిమాండ్..!

Sarkar Labs Drive: ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. చికిత్స ప్రక్రియ మరింత వేగవంతం..?