Chiranjeevi Davos: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ‘ఎకనామిక్స్ ఫోరమ్’ వార్షిక సదస్సు 2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ లో ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆయన్ని సదస్సుకు ఆహ్వానించారు. దీంతో ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ మెగాస్టార్ చిరంజీవి సదస్సుకు హాజరయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం అక్కడ ప్రత్యేకంగా నిలిచింది.
Read also-Ticket Hike: సినిమా టికెట్ల వివాదంపై మరో సారి సీరియస్ అయిన తెలంగాణ హైకోర్ట్..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించారు. అనంతరం.. కుటుంబ సభ్యులతో కలిసి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సినిమా అందించిన వినోదం పట్ల ఆయన తన అభినందనలను వ్యక్తిగతంగా చిరంజీవితో పంచుకున్నారు. స్విట్జర్లాండ్‌లో అనుకోకుండా కలుసుకున్న ఈ సదస్సు సందర్భంగా స్నేహపూర్వకంగా కలిసి సమయాన్ని గడిపారు. చిరంజీవి గారు కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్ర నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన సమయంలోనే ఈ ఆహ్లాదకరమైన సమావేశం, అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం జరిగింది.
Read also-Nara Rohith: వెంకటేష్ ‘ఎకే 47’లో పవర్ ఫుల్ రోల్ చేయబోతున్న నారా రోహిత్.. ఏంటంటే?

