CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్ భేటీ అయ్యారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ ఇన్నోవేషన్‌తో పాటు హెల్త్‌టెక్, అగ్రి టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యాన్ని పంచుకోనున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయెల్ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నది. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
సీఎంతో సీఈఓ మొహమ్మద్ ఆశిఫ్ భేటీ
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘ఎక్స్‌పర్టైజ్’ స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చూపింది. సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ మొహమ్మద్ ఆశిఫ్, దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, విద్యా వ్యవస్థకు ఉద్యోగ అవకాశాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ శిక్షణ అందించడమే స్కిల్ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశమన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, 2047 విజన్‌కు అనుగుణంగా తెలంగాణను భవిష్యత్‌కు సిద్ధమైన ప్రతిభా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
Also Read: Allu Arjun: మెగాస్టార్ సినిమా గురించి ఐకాన్ స్టార్ ఏం అన్నారంటే?.. ఇది సార్ బ్రాండ్..
సుమారు 5 వేల మంది
ప్రాథమిక విద్య, ఆధునిక నైపుణ్యాలు, శిక్షణ, మెంటార్‌షిప్ ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యం సాధించడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. భారతదేశంలో పూర్తిగా పరిశ్రమల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తొలి విశ్వవిద్యాలయం స్కిల్ యూనివర్సిటీ అని పేర్కొన్నారు. ఎక్స్‌పర్టైజ్ సంస్థ సీఈఓ మొహమ్మద్ ఆశిఫ్ మాట్లాడుతూ, ప్రతి ఏటా సుమారు 5 వేల మంది నైపుణ్య కలిగిన సిబ్బందిని నియమించుకునే అవసరం తమకు ఉన్నదని, ఆ అవసరాలను తీర్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యం చేసుకోవాలని ప్రతిపాదించారు. అవసరమైన అన్ని విభాగాల్లో శిక్షణను యూనివర్సిటీతో కలిసి ప్రారంభించాలనుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఈ సంస్థ, పెట్రో కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎరువులు, స్టీల్, సిమెంట్, వాటర్ ట్రీట్‌మెంట్, విద్యుత్ ఉత్పత్తి వంటి నైపుణ్యాధారిత రంగాల్లో ప్లాంట్ నిర్వహణ సేవలను అందిస్తున్నది.
Also Read: Son Kills Mother: వేరే వ్యక్తితో తల్లి సహజీవనాన్ని జీర్ణించుకోలేక దారుణానికి పాల్పడ్డ కొడుకు

