Harish Rao Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Taping Case) మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు (Harish Rao Investigation) సిట్ విచారణ ఎట్టకేలకు ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు ఏకంగా 8 గంటలకుపైగా ప్రశ్నించారు. సుధీర్ఘ సమయం పాటు సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. కాగా, విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన నోటీస్ అంతా ఒక ట్రాష్ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ‘‘నిజంగా చెప్పాలంటే ఉత్త సొల్లు. నిరాధారమైన ఆరోపణలు. ఆధారంలేని మాటలు. అడిగిందే అడుగుడు. సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఒక గంట అడుగుడు. పైనుంచి ఫోన్లు వస్తాయి. బయటకు పోవడం. గంట మాట్లాడుకొని మళ్లీ రావడం. మళ్లో అర్ధగంటో, గంటో అడగంగనే.. ఫోన్ ఫోన్ అంటూ సైగలు వస్తాయి, మళ్లీ బయటకు పోవడం. ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తున్నారా?, సీపీ సజ్జనార్ చేస్తున్నారా? నాకు తెలియదు. ముగ్గురు అధికారులు ప్రశ్నించారు. ముగ్గురూ బయటకు వెళ్లడం, గంట మాట్లాడుకొని వచ్చి మళ్లీ అడగటం. అడిగిందే అడగడం తప్ప అందులో ఏమీ లేదు. ఇదంతా అటెన్షన్ డైవర్షన్ కోసమే’’ అని హరీష్ అన్నారు.
Read Also- Harish Rao Interrogation: ఉదయం నుంచి ఇంకా సిట్ విచారణలోనే హరీష్ రావు.. బీఆర్ఎస్‌లో ఆందోళన!
సైట్ విజిట్ నిబంధన పేరిట బొగ్గు గని కేటాయింపులకు సంబంధించిన విషయాన్ని బట్టబయలు చేశామని, సైట్ విజిట్ నిబంధన తీసుకురావడంతో మొదటి లబ్దిదారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదని ఆరోపించారు. ఉదయం తాను బయటపెడితే, సాయంత్రానికి నోటీసులు పంపించారని ఆరోపణలు గుప్పించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాత్రమే తాము అన్నామని హరీష్ రావు పేర్కొన్నారు. ‘‘రేవంత్ రెడ్డి నువ్వు నిజాయితీ పరుడవి అయితే, తప్పు చేయకపోతే, తక్షణమే సుప్రీంకోర్టో, హైకోర్టో సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు’’ అని డిమాండ్ చేశారు. అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నామని చెప్పారు.
ఆధారాలు సిద్ధం
‘‘నీ బామ్మర్దే మొదటి దోషి.. అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం.. రింగ్ కింగ్ మీ బామ్మర్ది దైర్యం ఉంటే విచారణ జరపాలన్నారు. ఉత్తమ్, కోమటి రెడ్డి, భట్టి మధ్య కొట్లాట బయట పడింది.. బొగ్గుటెండర్ల కోసం చేస్తున్నట్లు తెలుస్తున్నదన్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు.. లట్టు.. పొట్టు.. ఎన్ని సిట్లు అయినా వేసుకో రేవంత్ రెడ్డి అని సూచించారు. ఉద్యమాలు పోరాటాలు అరెస్టులు మాకు కొత్త కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాటు దేలిన సైనికులం.. ఉద్యమంలో వందలాది కేసులు పెట్టిన కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడామన్నారు. కాంగ్రెస్ నాయకుల లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయే వాల్లం కాదు.. ఈ అక్రమ కేసులు నాకు కొత్త కాదు అన్నారు. మీరిచ్చే నోటీసులు నా ప్రజా పోరాటానికి దక్కిన గౌరవంగానే భావిస్తానన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..ఒక ప్రైవేటు కేసులో కోట్లు ఖర్చు చేసి నన్ను ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. సుప్రీం కోర్టు.. హైకోర్టు ఫోన్ టాపింగ్ కేసు కొట్టి వేసింది.. మళ్లీ ఇప్పుడు సిట్ పేరిట విచారణ చేశారన్నారు. ఘోష్ కమిషన్ వేస్తే ఆ కమిషన్ అంతా డొల్ల అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వెల్లడించా.. మీ బామ్మార్ది అవినీతి బాగోతం బయట పెడితే నాకు సిట్ నోటీసులు ఇచ్చినవు’’ అని హరీష్ రావు అన్నారు.
Read Also- Women Empowerment: మహిళల స్వావలంబనే.. కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం.. మంత్రి దామోదర రాజనర్సింహ

