Political News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి తప్పారు: ఎంపీ
MP Raghunandan Rao addressing BJP rally in Gajwel, criticizing BRS and Congress parties
Telangana News, లేటెస్ట్ న్యూస్

Political News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి తప్పారు.. ఎంపీ రఘనందన్ రావు షాకింగ్ కామెంట్స్

Political News: బీజేపీకే ప్రజల పట్టం

బీఆర్ఎస్ ఆగమయ్యింది
కాంగ్రెస్ బద్నామైంది: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

గజ్వేల్, స్వేచ్ఛ: బీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలుగా రోజురోజూ కుచించుకుపోయిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు దారి తప్పారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రాజకీయ విమర్శలు చేశారు. , కుటుంబం ఆస్తుల పంపకంలో బీఆర్ఎస్ ఆగమైందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గజ్వేల్ లో మంగళవారం బీజేపీ ర్యాలీ, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం జరిగిన సభలో ఎంపీ మాట్లాడారు.

Read Also- Harish Rao Interrogation: ఉదయం నుంచి ఇంకా సిట్ విచారణలోనే హరీష్ రావు.. బీఆర్ఎస్‌లో ఆందోళన!

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయక ఇప్పటికే ప్రజల్లో బద్నామైందని, ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. గజ్వేల్‌లో వేల కోట్లు ఖర్చు పెట్టి చేసిన పనులు ప్రజలకు కాకుండా ఆ పార్టీ నాయకులకు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం సరైన దర్యాప్తు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రం కోసం దేశం కోసం అన్ని వర్గాల కోసం చేస్తున్న కృషిని స్వాగతించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గజ్వేల్‌లో ఇప్పటికే బీజేపీ అతిపెద్ద రెండో పార్టీగా ఉందని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్ల పొందడమే కాకుండా బీఆర్ఎస్ కంటే స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఈసారి గజ్వేల్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు యెల్లు రామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also- Silver Wedding Card: స్వచ్ఛమైన వెండితో.. 3 కేజీల పెళ్లి ఆహ్వాన పత్రిక.. ధర రూ.25 లక్షల పైనే!

Just In

01

BRS Strategy: హంగామా చేస్తున్న బీఆర్ఎస్.. గులాబీ అటెన్షన్ డైవర్షన్?

Sonu Sood Praises Pawan: డిప్యూటీ సీఎం పవన్‌పై సోనూసూద్ పొగడ్తలు.. వీడియో ఇదిగో

Coal Block Allegations: సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎందుకు?.. కేంద్ర మంత్రికి హరీష్ రావు కీలక లేఖ

Harish Rao Investigation: పైనుంచి ఫోన్లు వచ్చాయ్.. సిట్ విచారణపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Political News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి తప్పారు.. ఎంపీ రఘనందన్ రావు షాకింగ్ కామెంట్స్