Bhatti Vikramarka: మధిర మున్సిపాలిటీలో నేడు పదివేల చీరల పంపిణీ
ఏడాదిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మధిర, స్వేచ్ఛ: స్వయం సహాయక సంఘాల మహిళలకే కాకుండా అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పంపిణీ జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) క్లారిటీ ఇచ్చారు. మంగళవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు డివిజన్‌లో డిప్యూటీ సీఎం చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఒక్కరోజే మధిర మున్సిపాలిటీ పరిధిలో 10,272 చీరల పంపిణీ జరుగుతుందని తెలిపారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో 5 వేల మంది స్వయం సహాయక సభ్యులు ఉన్నారని, మరో 5,000 మంది చేరాల్సిన అవసరం ఉందని అన్నారు.
Read Also- Silver Wedding Card: స్వచ్ఛమైన వెండితో.. 3 కేజీల పెళ్లి ఆహ్వాన పత్రిక.. ధర రూ.25 లక్షల పైనే!
స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేరితే వడ్డీ లేని రుణాలతో పాటు అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏడాది కాలంలో పూర్తి అవుతాయని, శుభ్రతతో కూడిన పట్టణంగా మధిరను మార్చడమే తన లక్ష్యమని డిప్యూటీ సీఎం తెలిపారు. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఇసుక, కంకర, సిమెంటు వస్తువులు, పనులతో ఆ వాతావరణం గందరగోళంగా ఉంటుందని, ఇల్లు పూర్తయిన తర్వాత హాయిగా అనిపిస్తుందని, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల క్రమంలో కొంత ఇబ్బంది కలుగుతున్నట్టుగా అందరూ గుర్తించాలని డిప్యూటీ సీఎం అభ్యర్థించారు. ఇళ్లలోని మరుగుదొడ్ల నుంచి వచ్చే కలుషిత నీరు పైపుల ద్వారా బయటికి పంపించి ట్రీట్మెంట్ చేస్తారని, ఈ క్రమంలో రోడ్లు పగలగొట్టి మధ్యలో పైపులు వేయడం తప్పదని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత మధిర పట్టణం మొత్తం కొత్త సీసీ రోడ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు.
Read Also- Nitin Nabin – Modi: నేను బీజేపీ కార్యకర్తను… నాకు బాస్ నితిన్ నబీన్.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

