AP 10th Exams Schedule: ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్ (AP 10th Exams Schedule) విడుదలైంది. మార్చి 16న ఎగ్జామ్స్ ప్రారంభమవనున్నాయి. ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయని ప్రకటనలో విద్యాశాఖ పేర్కొంది. పరీక్ష సమయం విషయానికి వస్తే ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుందని వివరించింది.
షెడ్యూల్ ఇదే
మార్చి 16 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20 – ఇంగ్లిష్
మార్చి 23 – గణిత శాస్త్రం
మార్చి 25 – భౌతిక శాస్త్రం (ఫిజికల్ సైన్స్)
మార్చి 28 – జీవశాస్త్రం (బయోలాజికల్ సైన్స్)
మార్చి 30 – సోషల్ స్టడీస్
మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2/ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
ఏప్రిల్ 1 – ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్ (థియరీ).

