Anasuya Bharadwaj: అనసూయ ఈ మధ్య ఏ విధంగా వార్తలలో హైలెట్ అవుతుందో తెలియంది కాదు. ‘దండోరా’ ప్రమోషన్స్ నిమిత్తం జరిగిన వేదికపై శివాజీ చేసిన కామెంట్స్‌తో (Sivaji Comments) ఇండస్ట్రీలో రచ్చ మొదలైంది. మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన కామెంట్స్, కాంట్రవర్సీగా మారడం, అలాగే జనాల నుంచి మిశ్రమ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. కొందరు శివాజీ కామెంట్స్‌ని ఖండిస్తే.. మరికొందరు ఆయన ఎక్స్‌ప్రెస్ చేసిన విధానం తప్పుగా ఉండొచ్చు కానీ, ఆయన చెప్పింది మాత్రం నిజమని కామెంట్స్ చేస్తూ వచ్చారు. శివాజీ కామెంట్స్‌పై మహిళా కమిషన్ కూడా సీరియస్ అవడం, శివాజీ వెళ్లి వివరణ ఇవ్వడం వంటి విషయాలన్నీ అందరికీ తెలిసిందే. శివాజీ సారీ చెప్పిన తర్వాత కాంట్రవర్సీ ముగుస్తుందని అనుకున్నారు కానీ.. నెటిజన్లు ఎవరో ఒకరు చిన్మయి (Chinmayi), అనసూయ (Anasuya) వంటి వారిని రెచ్చగొడుతూ కామెంట్స్ పెడుతూ, మళ్లీ మళ్లీ ఈ విషయాన్ని తోడుతున్నారు.
Also Read- Renu Desai: అందుకే పవన్ కళ్యాణ్ నీ నుంచి విడిపోయాడు.. అలాంటి థంబ్స్ పెట్టకండి ప్లీజ్!
మన నేతలు నడిపే భారతదేశమిది
ఇలా నడుస్తున్న ఈ కాంట్రవర్సీలోకి ఇప్పుడు కొత్తగా మరో అంశం వచ్చి చేరింది. హత్యాచారం చేసిన వారెవరైనా సరే, ఇకపై వెంటనే మరణశిక్ష అనేలా బిల్ వస్తే పార్లమెంట్‌లో ఆ బిల్ ఎప్పటికీ పాస్ కాదట.. అంటూ చిన్మయి చేసిన ఓ పోస్ట్‌ని అనసూయ షేర్ చేసి, ఇండియాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘పార్లమెంటులో హత్యాచారం చేసిన వారికి మరణశిక్ష అనే బిల్ అనేది ఎప్పటికీ పాస్ కాదట. ఎందుకంటే దాదాపు 40 మంది పార్లమెంట్ సభ్యులు ఇలాంటి హత్యాచార కేసుల్లో ఉన్న వారేనట’’ అంటూ సింగర్ చిన్మయి ట్వీట్ వేశారు. ఆ ట్వీట్‌కి అనసూయ రియాక్ట్ అవుతూ.. ‘‘ఇదే మన భారతదేశం, మనం ఎంచుకున్న నేతలు నడిపే భారతదేశం.. చాలా దూరం కదా దారి.. మనం మాత్రం బట్టల దగ్గరే ఆగిపోయాం’’ అని సెటైరికల్‌గా స్పందించారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు కామెంట్స్ చేయడానికి వీల్లేకుండా ఆమె ఆ సెక్షన్‌ని ఆపేశారు.
Also Read- VT15: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 15వ మూవీ టైటిల్ ఇదే.. గ్లింప్స్ అదిరింది
సినిమా ఇండస్ట్రీలోనే కాదు..
మరిప్పుడు అనసూయ, చిన్మయి చేసిన ఈ పోస్ట్‌ల వెనుక అర్థం చాలానే ఉంది. ముఖ్యంగా రాజకీయ నేతలని వారు టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. దీనిపై రాజకీయ నేతలు ఎవరైనా స్పందిస్తారా? అనేది చూడాల్సి ఉంది. మరోవైపు, ఈ ట్వీట్‌తో ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు, అన్ని చోట్ల ఇలాంటివి ఉన్నాయనేలా నిరూపితమవుతుందనేలా కొందరు పోస్ట్‌లు చేస్తున్నారు. ప్రస్తుత సమాజాన్ని బాగుచేయడం స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల వల్ల కూడా కాదంటూ, కొందరు బాధ్యత గల యువత రియాక్ట్ అవుతోంది. మొత్తంగా చూస్తే, ఇలా ఏదో ఒక విషయం అనసూయ ఎక్స్ పేజీకి పని కల్పిస్తూనే ఉంది. ఆమె పోరాటం ఇప్పటిలో అయితే ఆగేది కాదు, ఆమె పోరాటం వల్ల మారేది కూడా ఏం లేదు.. అంటూ కొందరు సోషల్ మీడియా జ్ఞానులు అంటుండటం విశేషం.
Idey mana Bharatadesam .. manam yenchukunna netalu nadipe Bharatadesam 🙏🏻🙏🏻🙏🏻 chaala dooram kada daari.. manam battala daggare aagipoyam.. https://t.co/ZC5YHyfpNC
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 18, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

