DGP Office Scandal: డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహిళలతో పోలీసు ఉన్నతాధికారి రాసలీలలు చేస్తున్న వీడియో కలకలం సృష్టిస్తోంది. ఓ అధికారి పలువురు మహిళలతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మహిళలకు అండగా నిలవాల్సిన పోలీసులే.. ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడతారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దృష్టికి సైతం వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆయన.. సదరు అధికారిపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే..
డీజీపీ ఆఫీసులో సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా పనిచేస్తున్న డా. రామచంద్రరావు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఆఫీసులో పనిచేసే ఉద్యోగినులను ముద్దు పెట్టుకోవడం, కౌగిలించకోవడం, అసభ్యకరంగా తాకడం వంటివి కనిపించాయి. వీడియో బయటకు రావడంతో డీజీపీ రామచంద్రరావు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఆయన హుటాహుటీనా హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర నివాసానికి పరిగెత్తుకు వెళ్లారు.
A fresh controversy has erupted in #Karnataka after a video allegedly showing a DGP-rank IPS officer engaging in inappropriate behaviour with women inside his office surfaced in the public domain.
Unlike earlier scandals involving political figures, this episode reportedly… pic.twitter.com/pQszE1jyeR
— Hate Detector 🔍 (@HateDetectors) January 19, 2026
డీజీపీ ఏమన్నారంటే?
హోంమంత్రితో చర్చించిన అనంతరం డీజీపీ రామచంద్రరావు బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోను కల్పితమైనవని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసుకోవచ్చని కోరారు. ‘ఈ వీడియోను చూసి నేనూ షాక్ అయ్యా. అవి నిజం కావు. నేను న్యాయవాదిని కలిసి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదు చేస్తా’ అంటూ పేర్కొన్నారు.
Also Read: Medaram Jatara 2026: మేడారానికి మహర్దశ.. ఈసారి కొత్తగా, సరికొత్తగా.. మారిన రూపు రేఖలు!
గతంలోనూ వార్తల్లో నిలిచిన డీజీపీ
1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రామచంద్రరావు.. 2025 ప్రారంభంలోనూ వార్తల్లో నిలిచారు. ఆయన రెండో భార్య కూతురు, నటి రన్యారావును బంగారం స్మగ్లింగ్ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసినప్పుడు రామచంద్రరావు పేరు విస్తృతంగా వినిపించింది. బంగారం అక్రమ రవాణాలో రామచంద్రరావు పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు కూడా జరిగింది. ఈ క్రమంలో ఆయన్ను కొన్ని రోజుల పాటు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించకుండా సెలవులపై ఉంచారు. కొన్నాళ్ల క్రితమే ఆయనకు తిరిగి డీజీపీ ఆఫీసులో డీసీఆర్ఈ అధికారిగా బాధ్యతలు కేటాయించారు. ఇప్పుడు రాసలీలల వీడియోతో ఆయన మరోమారు వార్తల్లో నిలవడం గమనార్హం.

