Eco Park Scam: ఎక్స్ పీరియం ఎకో పార్క్ యాజమాని ఘారానా మోసం
–లీజు పేరుతో లాగేసుకున్న పేదల భూమి
–ఐదేండ్ల అగ్రీమెంట్ ను 99 యేండ్లకు పోడగింపు
–ఎకో పార్క్ లో నాలాలు, ప్రభుత్వ భూమి కబ్జా
–ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్న రాందేవ్ రావు
–సాగు భూమిని గుంతల మయంగా మార్చేసిన వైనం
–నగదు ఇవ్వాలని అడిగిన రైతులకు గన్ బెదిరింపులు
– మా చావుకు రాందేవ్ రావే కారణమంటూ రైతులు ఆవేదన
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: పేదవాడు, బలహీనులు అంటే వ్యాపారులకు చిన్న చూపు. వారిలోనున్న బలహీనతలను ఆసరా చేసుకోని వాడుకోవడం ఆలవాటుగా మారిపోయింది. భూమి లేని నిరుపేదలకు గతంలోని కాంగ్రెస్(Vongress) ప్రభుత్వం అసైన్డ్ పట్టా పేరుతో భూ పంపిణీ చేసింది. ఆ భూమిలో ఎన్నో యేండ్లుగా సాగు చేసుకుంటున్న రైతులు రాందేవ్ రావు(Ramdevrao) అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూమిలో కేవలం బోమ్మల తయారీ చేసుకుంటానని చెప్పి ఐదేండ్లు లీజు తీసుకుంటున్నట్లు అగ్రీమెంట్లు చేసుకున్నారు. తీరా ఆ అగ్రీమెంట్లు పరిశీలిస్తే 99 యేండ్లకు వ్రాసుకున్నట్లు పత్రాలు సృష్టించి రైతులను మోసం చేశారు. తల్లి పేరుతోనున్న అసైన్డ్ భూమిని ముగ్గురు కుమారులు కలిసి రాందేవ్ రావుకు అగ్రీమెంట్ చేస్తే నగదు ఇవ్వలేదు.. ఓరిజనల్ డాక్యుమెంట్లు ఇవ్వకుండా రైతులను వేదిస్తున్నట్లు తెలుపుతున్నారు. ఆటో, లారీ నడుపుకోని జీవనం గడుపుతున్న పేదలతో ఎకో పార్క్ యాజమాని ఆటలు ఆడుతున్నాడు. రెక్కాడితే గానీ డొక్క నిండని పేదల భూమిపై ఎక్స్ పీరియం ఎకో పార్క్ యాజమాని రాందేవ్ రావు కన్నెశారు.
ఇదీ పరిస్థితి..
దేశంలో అతిపెద్ద ఎకో పార్కు హైదరాబాద్(Hyderabad) నగరంలో ఉందని చెప్పి వ్యాపారం చేస్తున్న రాందేవ్ రావు(Ramdev Rao) ఆగడాలకు అంతులేదు. ఎక్స్ పీరియం ఎకో పార్క్ పేరుతో చూట్టు పక్కలనున్న రైతుల భూములను లాగేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. సమాజంపై అవగాహాన, వ్యక్తుల పట్ల గౌరవ మర్యాదలు లేకుండా, మానవత్వం లేని రాందేవ్ రావు కేవలం వ్యాపారమే లక్ష్యంగా చేసుకొని ఎకో టూరిజం పార్క్ ఏర్పాటు చేశాడని చెప్పడం సందేహాం లేదు. ఎందుకంటే పనిచేస్తే గానీ పూటగడవని రైతులు పార్కుకు అవసరమైన బొమ్మల తయారీకి భూమి అగ్రిమెంట్ చేస్తే పొట్టగొట్టేందుకు సిద్దపడిన వ్యక్తి అని స్పస్టమైతుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దూటూరు గ్రామ పరిధిలో 150 ఎకరాల స్థలంలో 25వేల మొక్కల జాతులతో ఎకో పార్క్ ఐదేండ్ల కింద ఏర్పాటు చేశారు. ఈపార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణం కాపాడటంలో భాగంగా మద్దతు తెలిపారు. కానీ ఎకో పార్క్‌కు అనుకొని ఉన్న 305 సర్వే నెంబర్లో సుమారుగా 2 ఎకరాల స్థలం రాందేవ్ రావు ఐదేండ్లకు లీజుకు తీసుకున్నారు. కేవలం బొమ్మల తయారీ వరకే స్థలం ఉపయోగిస్తాము. సాగు భూమికి హాని తలపెట్టనని చెప్పారు. ఆ యాజమాని భూమి తమదే అన్న విధంగా రాత్రికి రాత్రి పెద్ద పెద్ద గుంతలు తొవ్వి సాగు భూమిని నాశనం చేశారు. ఆ గుంతల్లో నీళ్లు నింపి ఎకో పార్క్‌లో ఉండే మొక్కలకు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా పోలాల వద్దకు వెళ్లే నక్ష బాటను సైతం కబ్జా చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఐదేండ్ల కు ఇవ్వల్సిన నగదు ఇవ్వకపోగా… భూమి దగ్గరికి వచ్చిన రైతులను గన్ పెట్టి చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నారు. పార్కుకు రక్షణగా ఉండే సెక్యూరిటీ గార్డ్స్‌తో బెదిరింపులు, భూమి వద్దకు రాకుండా నెట్టి వేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్‌ని చూసేందుకు తరలివస్తున్న ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న లేఖలు!
పోలీసుల సహాయంతో భాగోతం బహిర్గతం
ఎకో పార్క్ రాందేవ్ రావు బెదరింపులు, దురుసు ప్రవర్తనతో విసుగెత్తిన రైతులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సివిల్ కేసుల్లో జాగ్రత్తగా వ్యవహారిస్తున్నారు. రాందేవ్ రావుపై కేసు పెట్టేందుకు వెళ్లిన రైతులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పేద రైతుల ఆవేధన తట్టుకోలేక పోలీసులు రాందేవ్ రావుకు ఫోన్ చేసి మీపై రైతులు కేసు పెట్టేందుకు వచ్చారని సమాచారం ఇచ్చారు. ఆ రాందేవ్ రావు సమాదానం ఇస్తూ నాకు రైతులు 99 యేండ్లు భూమిని లీజుకు ఇచ్చారని, అగ్రిమెంట్ పత్రాన్ని పోలీసులకు పంపించడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు రైతులకు చేరవేయడంతో వారి ఆవేధన మరింత ఎక్కువైయింది. ఐదేండ్లకు అగ్రిమెంట్ అని చెప్పి మాతో సంతకాలు చేసుకోని, మరుసటి రోజు అగ్రిమెంట్లు పేపర్లు ఇస్తామని చెప్పి వెళ్లి పరారైన రాందేవ్ 99 యేండ్లకు వ్రాసుకున్నాడని రైతులు కన్నీంటి పర్వంతమైతున్నారు.
మా చావుకు కారణం రాందేవ్ రావు
మా భూమి మాకు దక్కే వరకు పోరాడుతామని, ఐదేండ్లకు సంబంధించిన అగ్రిమెంట్ నగదు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సాగుకు సారవంతమైన భూమిని నాశనం చేసి మట్టి తొవ్విన గుంతలను పూడ్చివేయాలని అన్నారు. మేము కడుపులో పేగులు లేని వాళ్లమని, నమ్మి లీజుకు భూమి ఇస్తే కబ్జా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని తల్లి, కొడుకులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మేము చచ్చిపోతే చావుకు కారకులు ఎకో పార్క్ యాజమాని రాందేవ్ రావేనని మీడియా ముఖంగా తెలిపారు.
Also Read: KGBV Teachers: సార్ మా గోడు వినండి.. చాలీచాలని జీతాలతో కేజీబీవీ ఉద్యోగులు అవస్థలు..!

