Aakasamlo Oka Tara: దుల్క‌ర్ సరసన నటించే తార ఈ భామే..
Satvika Veeravalli in a graceful traditional look from Aakasamlo Oka Tara movie, showcasing emotional depth and simplicity.
ఎంటర్‌టైన్‌మెంట్

Aakasamlo Oka Tara: దుల్క‌ర్ స‌ల్మాన్‌ సరసన నటించే తార లుక్ విడుదల.. ఎంత బావుందో!

Aakasamlo Oka Tara: వైవిధ్య‌మైన సినిమాలతో, పాత్ర‌ల‌తో.. బ‌హు భాషా న‌టుడిగా గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan) నుంచి మరో వైవిధ్యభరిత చిత్రం రాబోతోంది. కంటెంట్ బేస్డ్ మూవీస్ ప్రేక్ష‌కుల‌పై ఎక్కువ ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని నమ్మే దుల్కర్, ఆ తరహా చిత్రాలనే ఎక్కువగా ఎన్నుకుంటున్నారు. హీరోగా, నిర్మాతగా కంటెంట్ సెలక్షన్‌లో తనదైన హవా సాగిస్తున్న దుల్కర్.. ప్రేక్షకులలో మంచి నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే, అందులో కచ్చితంగా మంచి కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు చాలా గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. ఆ న‌మ్మ‌కం నిలబెట్టుకునే క్రమంలో ఆయ‌న చేస్తోన్న మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార‌’ (Aakasamlo Oka Tara). ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌టంతో పాటు సినిమాపై భారీగా అంచ‌నాల‌ను పెంచేసిన విషయం తెలిసిందే. యూనిక్ సినిమాటిక్ ఎప్రోచ్‌, ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్‌తో సినిమాను రూపొందించే డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని ఈ చిత్రానికి దర్శకుడు.

Also Read- VT15: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 15వ మూవీ టైటిల్ ఇదే.. గ్లింప్స్ అదిరింది

పదహారణాల తెలుగమ్మాయిగా..

‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వ‌ప్న సినిమా స‌మ‌ర్ప‌ణ‌లో లైట్ బాక్స్ మీడియా బ్యాన‌ర్‌పై సందీప్ గున్నం, ర‌మ్య గున్నం నిర్మిస్తున్నారు. పెద్ద నిర్మాణ సంస్థ‌లు ఈ సినిమా నిర్మాణంలో భాగం కావ‌టంతో సినిమా మొదటి నుంచి ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకుంటోంది. ఈ ప్ర‌ముఖ బ్యాన‌ర్స్ మ‌రో బ్రిలియంట్ టాలెంట్‌ను ఈ సినిమాతో ప‌రిచ‌యం చేస్తున్నారు. ఆ టాలెంటెడ్ తార ఎవరో కాదు.. సాత్విక వీరవల్లి (Introducing Satvika Veeravalli). అవును.. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో సాత్విక వీర‌వ‌ల్లి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. సోమ‌వారం ఆమె క్యారెక్ట‌ర్ టీజ‌ర్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. ఇక మేకర్స్ వదిలిన పోస్టర్‌లో సాత్విక పదహారణాల అచ్చమైన, స్వచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తూ.. అందరినీ ఆకర్షిస్తోంది.

Also Read- Chiranjeevi MSG: మన ప్రసాద్ గారు ఫస్ట్ వీకే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారోచ్.. వివరాలివే!

ఎంత అందంగా ఉందో..

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. స‌రైన రోడ్లు కూడా లేని ఒక మార‌మూల ప‌ల్లె నుంచి వ‌చ్చిన ఓ అమ్మాయి.. ఆకాశంలో తార‌ల‌ను చేరుకోవాలంటూ క‌నే క‌ల‌లను క‌థ‌గా చూపించారు. దీనికి జీవీ ప్ర‌కాష్ హృద‌యాల‌ను హ‌త్తుకునేలా బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. సాత్విక‌ను ఇందులో ఎంతో అందంగా చూపించారు. ఇంకా చెప్పాలంటే.. చూడగానే ఎంత బావుందో అనిపించేలా ఆమె లుక్ ఉంది. ఆమె త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని, మెప్పించ‌టానికి సిద్ధంగా ఉంద‌ని ఈ టీజ‌ర్ మరింత స్ప‌ష్టం చేస్తోంది. ఈ సినిమాలో నటించే న‌టీన‌టులెవ‌ర‌నే విష‌యాల‌ను ఇంకా పూర్తిగా చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ.. విడుద‌లైన గ్లింప్స్ మాత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఆమె ప్ర‌యాణంలోని నిశ్శ‌బ్ద‌మైన క్ష‌ణాలు, చివ‌ర‌ల్లో దుల్క‌ర్ త‌ళుక్కున మెరవడం.. వంటి విష‌యాలు చాలా భావాల‌ను తెలియజేస్తున్నాయి. వైవిధ్య‌మైన‌, అర్థ‌వంత‌మైన క‌థ‌ల‌ను ఎంచుకునే దుల్క‌ర్ స‌ల్మాన్ అభిరుచికి త‌గ్గ‌ట్లు, డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని క్రియేటివిటీ క‌లిసి ఒక ప్ర‌త్యేక‌మైన‌, గుర్తుండిపోయే సినిమాగా ‘ఆకాశంలో ఒక తార‌’ సినిమా ఉంటుందనే ఫీల్‌ని ఈ గ్లింప్స్ ఇస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను, ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Substandard Bridge: నాసిరకం బ్రిడ్జిను నిర్మిస్తున్న కాంట్రాక్టర్.. బయటపడ్డ బండారం.. ఫొటో ఇదిగో

Political News: ఇవి బురద రాజకీయాలు.. వైసీపీ, బీఆర్ఎస్‌లపై టీడీపీ ఎంపీ ఫైర్

Cheen Tapak Dum Dum: సమంత క్లాప్‌తో మొదలైన ‘చీన్ టపాక్‌ డుం డుం’.. వివరాలివే!

BRS Complaint on CM: సీఎంపై చర్యలు తీసుకోండి.. డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఫిర్యాదు

Anaganaga Oka Raju: సెంచరీ కొట్టేసిన రాజుగారు.. నిర్మాత పంట పండిందిపో!