Gadwal Accident: జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అనంత లోకాలకు వెల్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యీయి.
వివరాల్లోకి వెలితే..
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వేముల స్టేజి సమీపంలో 44 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ(AP)లోని కర్నూలు(Karnulu) జిల్లా పంచలింగాల గ్రామం నుండి 20 మంది ప్రయాణికులతో నాగర్ కర్నూల్(Nagarkarnul) జిల్లా కొల్లాపూర్(Kollapur) దగ్గరలోని సింగోటం జాతర రథోత్సవం(Singotam Jathara Chariot Festival) ముగించుకొని గత అర్ధరాత్రి తిరిగు ప్రయాణం అయ్యారు. తిరిగి వస్తుండగా వేముల స్టేజి సమీపంలో ట్రాక్టర్ను డీసీఎం వ్యాన్ భలంగా ఢీకొట్టింది. దీంతె వెంటనే ఖాజన్ గౌడ్(45) వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. మిగిలిన వారైన వెంకటస్వామి గౌడ్, వెంకటేశ్వరమ్మ, జయమ్మ, నాగులు, మంజుల, శివమ్మ, స్వాములు, లింగమ్మ అనే ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కులకు.. యువ ఐపీఎస్‌లతో చెక్.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

