Telangana Cabinet Meet: ములుగు జిల్లాలోని హరిత హోటల్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం
మేడారం శాశ్వత పనులపై పునః సమీక్ష
రైతు భరోసాపై మంత్రులతో చర్చ
పొట్లాపూర్, గోదావరి ఎత్తిపోతల పథకాలపై చర్చ
జిల్లాల పునర్విభజనపై విస్తృత స్థాయి సమావేశం
రోడ్లు, రహదారుల అభివృద్ధిపై చర్చ
ములుగు, స్వేచ్ఛ: తెలంగాణ రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో సచివాలయానికి బయట మొదటిసారిగా.. సమ్మక్క సారలమ్మ జాతరకు అతి సమీపంలో ఉన్న హరిత హోటల్లో కేబినెట్ మీటింగ్ (Telangana Cabinet Meet) సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగింది. మంత్రులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది. దేశ చరిత్రలోనే రాజధాని నగరం వెలుపల, అందునా అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న కేబినెట్ సమావేశం చరిత్రలోనే నిలిచిపోనుంది. మేడారంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా కేబినెట్ మీటింగ్ ప్రారంభమైంది. ప్రజలకు సంబంధించిన మేడారం శాశ్వత అభివృద్ధికి ఇంకా ఏం చేయాలి.. ఇప్పటిదాకా ఏం చేశారు.. ఏం చేస్తే బాగుంటుందనే నేపథ్యంలో కేబినెట్‌లో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆదివాసి ప్రజలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఆదివాసి దేవతల క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరగడం సర్వత్ర ఆసక్తి నెలకొంది.
Read Also- Medchal Police: హ్యాట్సాఫ్ పోలీస్.. దొంగతనాల నిందితుల పట్టివేత కేసుల్లో ఆ జిల్లానే టాప్!
ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేక చర్చ
ములుగు జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల రైతులకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకాలపై పూర్తిస్థాయిలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం, గోదావరి దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన విషయం, జిల్లాల పునర్విభజనల పై వస్తున్న విమర్శల నేపథ్యంలో చేయాల్సిన ప్రణాళిక పై చర్చించినట్లుగా తెలుస్తోంది. యాసంగికి సంబంధించి రైతులకు రైతు భరోసా పథకంపై అత్యంత త్వరలోనే రైతులకు చేయూత అందించేందుకు వారి ఖాతాల్లో నగదు బదిలీ చేసేందుకు కూడా చర్చ జరిగినట్లుగా సమాచారం. రోడ్లు, రహదారుల విషయంలో కాంట్రాక్టర్లు, బ్యాంకర్లు సరైన రీతులో స్పందించకపోవడంపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. రహదారుల నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లకు సరైన సమయంలో బిల్లులు చెల్లించే విధంగా ప్రణాళిక రచించాలని మంత్రులకు దిశా నిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.
Read Also- GHMC Politics: జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియక ముందే మొదలైన పాలిటిక్స్
గ్రామపంచాయతీ ఎన్నికల్లో 68 శాతం గెలుపులను సాధించిన కాంగ్రెస్ పార్టీ రానున్న మునిసిపాలిటీ, మహానగరపాలక సంస్థలలో కూడా దాదాపుగా 100 శాతం సీట్లను కైవసం చేసుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రచించినట్లుగా కేబినెట్‌లో చర్చించినట్లుగా తెలుస్తోంది. 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి. భక్తులకు ఆటంకాలు కలగకుండా చేయాలంటే ఎలాంటి ప్రణాళికలు రచించాలనే విషయం పైన కూడా కేబినెట్‌లో చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది. గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన కూడా మంత్రులతో చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది. మేడారంలో శాశ్వత అభివృద్ధి పనుల పానులను పూర్తిస్థాయిలో అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సీఎం వీక్షించనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ముగ్గురు మంత్రులపై వచ్చిన అంశాలపై కేబినెట్లో ప్రత్యేకంగా చర్చించినట్లుగా తెలుస్తోంది.

