AR Rahman: ఏఆర్ రెహమాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ‘ఛావా’ (Chhaava) సినిమాను ఉద్దేశిస్తూ, అలాగే బాలీవుడ్‌లో తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం ‘కమ్యూనల్’ ప్రాబ్లమ్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని (AR Rahman Controversial Comments) రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను అందరూ ఖండిస్తున్నారు. నిజంగా అలాంటి ప్రాబ్లమే ఉంటే.. ఆస్కార్ వరకు వెళ్లేవాడివే కాదంటూ కొందరు డైరెక్ట్‌గానే అటాక్ చేస్తున్నారు. ఎంతగానో ఆదరించారు కాబట్టే.. ఇంకా నీ పేరు గొప్పగా వినిపిస్తుందనేలా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంకొందరైతే.. ఆయన పర్సనల్ జీవితాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఇంట్లో ఉన్న ఇష్యూస్‌తో నువ్వు ఇండస్ట్రీకి దూరంగా ఉండి, ఇప్పుడలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, ఎవరినీ హర్ట్ చేయడానికి కాదంటూ ఏఆర్ రెహమాన్ (AR Rahman) తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..
Also Read- NTR Death Anniversary: ఆయనలా స్వార్థం లేకుండా ఈ రోజున రాజకీయం చేయగలరా?
భారతీయత నాకు లభించిన వరం
‘‘భారతదేశం నా స్ఫూర్తి, నా గురువు, నా ఇల్లు. కొన్నిసార్లు ఉద్దేశాలు తప్పుగా అర్థం చేసుకోవచ్చని నేను గ్రహించాను. కానీ సంగీతం ద్వారా అందరినీ ఉత్తేజపరచడం, గౌరవించడం, సేవ చేయడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశ్యం. ఎవరినీ బాధపెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, నా చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. భారతీయత నాకు లభించిన వరం. ఇది వ్యక్తీకరణ స్వేచ్ఛను అందిస్తూ, భిన్న సంస్కృతులను గౌరవించే అవకాశాన్ని ఇస్తుంది. వేవ్ సమ్మిట్‌లో గౌరవనీయులైన ప్రధానమంత్రి సమక్షంలో ‘ఝాలా’ సమర్పించడం నుండి, ‘రూహి నూర్’ వరకు.. యువ నాగా సంగీతకారులతో కలిసి స్ట్రింగ్ ఆర్కెస్ట్రాను రూపొందించడం.. సన్‌షైన్ ఆర్కెస్ట్రాకు మార్గదర్శకత్వం వహించడం.. భారతదేశపు మొట్టమొదటి మల్టీ-కల్చరల్ వర్చువల్ బ్యాండ్ ‘సీక్రెట్ మౌంటైన్’ నిర్మించడం.. ఇంకా హన్స్ జిమ్మెర్‌తో కలిసి ‘రామాయణ’ (Ramayana) చిత్రానికి సంగీతం అందించే గౌరవం దక్కడం.. ఇలా ప్రతి ప్రయాణం నా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ దేశానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. గతాన్ని గౌరవించే, వర్తమానాన్ని వేడుకలా మార్చే, భవిష్యత్తుకు స్ఫూర్తినిచ్చే సంగీతానికి నేను కట్టుబడి ఉన్నాను. జై హింద్.. జయహో!’’ అని చెప్పుకొచ్చారు.
Also Read- MSG Movie: ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఆల్ ఏరియాస్ బ్రేకీవెన్.. పోస్టర్ వచ్చేసింది
మ్యూజిక్‌పై ఫోకస్ పెట్టు గురు
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు, మళ్లీ ఇలా వివరణ ఇవ్వడం ఎందుకంటూ ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు, ఇలాంటి వివాదాల జోలికి పోకుండా, నీ మ్యూజిక్‌పై ఫోకస్ పెట్టమని సలహాలు ఇస్తున్నారు. మొత్తంగా అయితే, ఈ వివాదం ఇంతటితో ముగిసిందని మాత్రం భావించవచ్చు. ప్రస్తుతం రెహమాన్ ‘పెద్ది’ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ సంచలన ఆదరణను రాబట్టుకుని, విడుదలైన అన్ని భాషల్లో కలిపి 200 మిలియన్ల ప్లస్ వ్యూస్‌ని రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.
A.R.Rahman reponds with clarity ❤
— A.R.Rahman Loops (@ARRahmanLoops) January 18, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

