Noida Tragedy: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దట్టమైన పొగ మంచు కారణంగా డ్రైనేజీ నీటి గుంట ప్రహారీని ఢీకొట్టి 27 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కారుతో సహా అందులో పడిపోయాడు. తాను మునిగిపోతున్నానంటూ తండ్రికి ఫోన్ చేశాడు. తనను ఎలాగైనా రక్షించాలంటూ ప్రాధేయపడ్డాడు. దాదాపు 5 గంటల పాటు శ్రమించి సహాయక బృందాలు అతడ్ని బయటకు తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
అసలేం జరిగిందంటే?
శుక్రవారం రాత్రి సెక్టార్ 150 సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెక్కీ యువరాజ్ మెహతా తన ఆఫీసు వర్క్ ముంగించుకొని కారులో ఇంటికి బయలుదేరాడు. దట్టమైన పొగమంచుకు తోడు రోడ్డుపై రిఫ్లెక్టర్లు లేకపోవడంతో అతడి కారు ఎత్తైన కొండను ఢీకొట్టి పక్కనే ఉన్న 70 లోతైన గుంటలో పడిపోయింది. అటుగా వెళ్తున్న వాహనదారులు మెహతా అరుపులు విని రక్షించేందుకు యత్నించినప్పటికీ సాధ్యపడలేదు.
తండ్రికి ఫోన్ చేసి..
కారుతో సహా మునిగిపోతున్న క్రమంలో యువరాజ్ మెహతా తన తండ్రి రాజ్ కుమార్ మెహతాకు ఫోన్ చేశాడు. ‘నాన్న, నేను నీటితో నిండిన లోతైన గుంటలో పడిపోయాను. నేను మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను రక్షించండి. నేను చనిపోవాలని అనుకోవడం లేదు’ అంటూ తండ్రి వద్ద కన్నీటి పర్యంతమయ్యాడు. మరోవైపు స్థానికులు, మెహతా తండ్రి ఇచ్చిన సమాచారంతో పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.
5 గంటలు శ్రమించినా..
ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, గజ ఈతగాళ్లు సంఘటనా స్థలానికి చేరుకొని యువరాజ్ మెహతా పడిపోయిన నీటి గుంటలో రెస్క్యూ చర్యలు చేపట్టాయి. సుమారు 5 గంటల పాటు శ్రమించి.. టెక్కీ కారును అతి కష్టం మీద పైకి తీసుకొచ్చారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే యువరాజ్ మెహతా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఘటనా స్థలికి వచ్చిన అతడి తండ్రి రాజ్ కుమార్ మెహతా, అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
Also Read: Komatireddy Venkat Reddy: నల్లగొండ సమగ్రాభివృద్ధిపై మంత్రి ఫోకస్.. రూ.2 వేల కోట్ల పనులకు సాంక్షన్!
మెహతా కుటుంబం ఫిర్యాదు..
యువరాజ్ మెహతా మరణంపై అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవాణా శాఖ అధికారులు.. సర్వీస్ రోడ్డు వెంబడి రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయలేదని, డ్రైయిన్లను కవర్ చేయలేదని ఆరోపించింది. ఈ మరణం వెనుక దాగున్న అధికారుల నిర్లక్ష్యాన్ని వెలికితీసి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. మరోవైపు స్థానిక నిర్వాసితులు సైతం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు స్థానికులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు సైతం చేశారు. సర్వీస్ రోడ్డు వెంబడి రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని గతంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడ్డారు.
NOIDA
नोएडा अथॉरिटी के धुरंधर अफसरों की लापरवाही की कीमत एक युवक को जान गंवा कर देनी पड़ी!
फॉग के चलते विजिबिलिटी नहीं होने से एक कार तालाब में गिरी, कई घंटे युवक चीखता चिल्लाता रहा लेकिन मदद नहीं मिली और जान चली गई!
न रिफ्लेक्ट न बाउंड्री वाल!
जिम्मेदार कौन?
सेक्टर 150 की घटना pic.twitter.com/wwxG3piIqM— हिमांशु शुक्ल (@himanshu_kanpur) January 17, 2026

